కార్తీకదీపం సీరియలా? మజాకా?.. చివరి ఎపిసోడ్ చూడనివ్వలేదని చూపుడువేలు కొరికేశాడు..
కార్తీకదీపం క్లైమాక్స్ ఎపిసోడ్ చూడనివ్వకుండా చికాకు పెడుతున్న వ్యక్తి చూపుడువేలును కొరికేశాడో వ్యక్తి. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ములుగు : కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇలా కూడా చేస్తారా? అని ముక్కున వేలేసుకునేలా ఉంటాయి. వాటి గురించి విన్న తర్వాత.. ఆ ఘటన వెనక ఉన్న భావోద్వేగాలు విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటి ఓ ఘటన ఇది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వంటలక్కను, డాక్టర్ బాబును తమ ఇంట్లోని మనిషిగా చేసుకుంది ప్రతీ తెలుగింటి కుటుంబం. ఇక ఈ సీరియల్ ఆగిపోతుందంటే.. చివరి ఎపిసోడ్ చూసే క్రమంలో ఉండే ఉత్కంఠ, ఆసక్తి.. ఆ భావోద్వేగం సీరియల్ చూసేవారికే అర్థమవుతుంది.
మరి ఆ చివరి ఎపిసోడ్ను చూడనివ్వకపోతే..? వారించినా కూడా పదేపదే విసిగిస్తే.. ? అంతరాయం కలిగిస్తే..? ఎలా రియాక్ట్ అవుతారు? ఇదిగో ఈ దుకాణదారుడిలా మారిపోతారు. తనను కార్తీకదీపం సీరియల్ చివరి ఎపిసోడ్ చూడనివ్వలేదని ఓ వ్యక్తి చేతి వేలిని కొరికి.. అతడి రక్తాన్ని కళ్ళ చూశాడు ఆ షాపు యజమాని. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లాలోని పాలంపేటకు చెందిన గట్టు మొగిలి కిరాణషాపు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. అతని దుకాణంలో కిరాణా సామాన్ తో పాటు.. విడిగా మద్యం కూడా అమ్ముతుంటాడు. జనవరి 23వ తేదీ రాత్రి తాళ్లపల్లి వెంకటయ్య అదే గ్రామానికి చెందిన వ్యక్తి. ఆ రోజు రాత్రి మొగిలి దుకాణానికి వచ్చాడు. అతని దగ్గర మద్యం కొనుక్కుని తాగాడు. ఆ తరువాత మరింత మద్యం కావాలని అడిగాడు. అది అప్పు కింద ఇవ్వాలని విసిగించాడు.
ఆ సమయంలో మొగిలి టీవీలో వస్తున్న కార్తీకదీపం చివరి ఎపిసోడ్ను చూస్తున్నాడు. అప్పు కింద మద్య ఇచ్చేది లేదని వెంకటయ్యకు చెప్పాడు. కానీ వెంకటయ్య వినలేదు పదేపదే విసిగించడం మొదలుపెట్టాడు. ఎంత విసిగించినా ఇవ్వనని.. తను సీరియల్ చూస్తున్నానని.. చిరాకు పెట్టొద్దని చెప్పాడు. కానీ కావాలని వెంకటయ్య విసిగించడం మొదలుపెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన మొగిలి వెంకటయ్యపై దాడి చేశాడు.
హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు..
అతడి చేయి అందిపుచ్చుకొని కుడిచేతి చూపుడు వేలును కసుక్కున కొరికేశాడు. అనుకోని ఈ పరిణామానికి షాక్ అయిన వెంకటయ్య అప్పటికి అక్కడినుంచి పరగు అందుకున్నాడు. ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీని మీద ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు మొగిలయ్యను విచారించారు. విచారణలో అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక అవాక్కయ్యారు. కార్తీకదీపం సీరియల్ చివరి ఎపిసోడ్ చూస్తుంటే.. విపరీతంగా విసిగించడంతోనే ఆ పని చేశానని మొగిలి చెప్పాడు. దీంతో నేరం అంగీకరించడంతో మొగిలిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.