Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు..

హైదరాబాద్ లో రెండో  రోజు  ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా, మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్ల.. ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. 

IT raids continue for the second day in Hyderabad - bsb
Author
First Published Feb 1, 2023, 8:30 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐటీ దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా, మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఈ దాడులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వీరి కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డికి చెందిన ఇంటితో పాటు అనేక ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. తెల్లాపూర్ లోని అతని నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. రాజ్ పుష్పా, వసుధ, వర్టెక్స్, ముప్పా కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. సంస్థల ఎండీలు, డైరెక్టర్ల ఇళ్లలో ఈ సోదాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి ఆదాయం పన్ను శాఖ (ఐటి) దాడులు మొదలుపెట్టింది. వసుధ ఫార్మా, కెమికల్స్ సంస్థపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 40 చోట్ల ఐటి సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వసుదా ఫార్మా కంపెనీ చేర్మన్ రాజు నివాసంలోనే కాకుండా కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి సంస్థల్లో ఐటీ అధికారుల సోదాలు

15 కంపెనీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఐటి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఐటి సోదాలు ప్రారంభమయ్యాయి. 50 బృందాలుగా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ డెరూక్టర్ల నివాసాల్లో సోదాలు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 

కాగా,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డికి చెందిన సంస్థలు, ఇళ్లలో మంగళవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐదు వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు   ఎమ్మెల్సీకి చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ  వెంకట్రాంరెడ్డికి చెందిన సంస్థల ప్రతినిధులను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించారు.  గత కొంతకాలంగా హైద్రాబాద్ కేంద్రంగా  పలు రియల్ ఏస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios