ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ఆమెను వాటర్ ట్యాంకర్ కిందికి తోసేసి హత్య చేశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. 

హైదరాబాద్ : ప్రేమించాను అంటూ వెంటపడి.. లోబరుచుకుని.. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ట్యాంకర్ కిందికి తోసేసాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాదులోని బాచుపల్లిలో వెలుగు చూసింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది ఓ యువతి. ఆమెను ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు నమ్మించాడు. ఆ తర్వాత ఆమెను లోబరుచుకున్నాడు. మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

దీంతో ఈ విషయం తెలిసిన ఆ యువతి అతడిని నిలదీసింది. అది నచ్చని ఆ యువకుడు ఆమెను నీళ్ల ట్యాంకర్ కిందికి తోసేసాడు. తరువాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు దర్యాప్తులో అతను చేసిన దారుణం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. 

నన్ను సరిగా ఉపయోగించుకోవట్లే: జగ్గారెడ్డి.. పరోక్షంగా రేవంత్ రెడ్డిపై అసంతృప్తి?

బాధితురాలి పేరు భూక్యా ప్రమీల (23). ఆమెది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండా. తండ్రి పేరు హరిజియా. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. కొద్ది రోజుల క్రితం నగరానికి వలస వచ్చింది. ప్రమీలకు అంతకుముందే వివాహం అయ్యింది. కొద్దిరోజులకే భర్త చనిపోయాడు. 2022 జనవరిలో పెళ్లికాక.. నాలుగు నెలలకి అంటే ఏప్రిల్ లో భర్త కన్నుమూశాడు.

హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో మరో ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఉంటుంది. జీవనోపాధి కోసం బాచుపల్లిలోని స్టీల్ షాప్ లో పనిచేస్తోంది. నిందితుడు భూక్యా తిరుపతి నాయక్ (25)తో ప్రమీలకు చిన్నప్పటినుండే పరిచయముంది. అతను, ప్రమీల సొంతూరు దగ్గర్లో ఉన్న రోడ్ బండ తండాకు చెందినవాడు. 

తిరుపతి నాయక్ కొండాపూర్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నగరానికి వచ్చిన తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. పరిచయస్తులు కావడంతో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే.. ప్రమీలను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తిరుపతి నాయక్ తెలిపాడు. ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరిగింది.

ఈ విషయం ప్రమీలకు తెలిసింది. వెంటనే ఆమె తిరుపతి నాయక్ కు ఫోన్ చేసి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే తమ ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేస్తానని చెప్పింది. ఆదివారం పొద్దున కలవాలని ఆమె చెప్పింది. తిరుపతి టూ వీలర్ పై మరో స్నేహితుడితో కలిసి బాచుపల్లి ప్రధాన రహదారి దగ్గర ప్రమీలను కలిశాడు. ఆ సమయంలో పెళ్లి విషయంపై ప్రమీల నిలదీసింది.

దీంతో ఇద్దరు మధ్య తీవ్రవాగ్వాదం, పెనుగులాట జరిగింది. ఈ గొడవతో తీవ్ర అగ్రహావేశానికి లోనైన నిందితుడు అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ కిందికి ప్రమీలను తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఆమె యాక్సిడెంట్ గా ట్యాంకర్ కింద పడి చనిపోయిందని స్థానికులు, పోలీసులను నమ్మించాలని ప్రయత్నించాడు. కానీ, అనుమానించిన పోలీసులు గట్టిగా ప్రయత్నించారు. దీంతో తానే ట్యాంకర్ కిందికి తోచినట్లుగా నిజం ఒప్పుకున్నాడు.