లవ్ జిహాద్ తో ప్రమాదం పొంచి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి ‘ది కేరళ స్టోరీ‘ సినిమాను చూశారు. 

లవ్ జిహాద్ ప్రమాదకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. దాని వల్ల భారతదేశ సంస్కృతి, భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదం అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయని అన్నారు. ఇది సరికాదని ఆయన చెప్పారు.

దారుణం.. భార్యను ముక్కలుగా నరికి.. గోనె సంచెలో వేసి నిర్మానుష్య ప్రదేశంలో విసిరేసిన భర్త.. ఎక్కడంటే ?

జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి కాచిగూడ చౌరస్తాలో ఉన్న తారకరామ టాకీస్ లో కలిసి సోమవారం చూశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ది కేరళ స్టోరీ’కి ప్రభుత్వం ట్యాక్స్ ల నుంచి మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సినిమాను సీఎం కేసీఆర్, తన మంత్రులు, ఎమ్మెల్యేలందరితో కలిసి వీక్షించాలని సూచించారు. 

భార్యతో విడాకులు తీసుకున్న భర్త.. సంతోషంలో బంగీ జంప్, రోప్ తెగిపోవడంతో..

వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో కొలువుదీరేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. దాని తరువాత ఇలాంటి సినిమాలు వారానికి ఒకటి చొప్పున తీస్తామమని ఆయన అన్నారు. హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన యువతులు లవ్ జిహాద్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఇలా లవ్ జిహాద్ బారిన పడిన అనేక మంది యువతులను తాము కాపాడామని అని చెప్పారు. కాగా.. ఈ ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బండి సంజయ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రుద్రమదేవి తదితరులు కలిసి చూశారు. 

విశ్వాసం చాటుకున్న శునకం..ఆత్మహత్యకు పాల్పడ్డ యజమానిని కాపాడేందుకు 4 గంటలు తీవ్రంగా ప్రయత్నించి.. చివరికి

మాటకు కట్టుబడి జేపీఎస్ లను రెగ్యులర్ చేయాలి
జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారని బండి సంజయ్ అన్నారు. దానికి కట్టబడి ఉండాలని చెప్పారు. వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీఎస్ లను ఉద్యోగాల నుంచి తొలగించకూడదని అందులో పేర్కొన్నారు. ఒక వేళ అలా తొలగిస్తే బీజేపీ వారి తరఫున పోరాటం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 5 నెలలు మాత్రమే కొనసాగుతుందని అన్నారు. తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జేపీఎస్ లు అందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు.