భార్యతో విడాకులు తీసుకున్న భర్త.. సంతోషంలో బంగీ జంప్, రోప్ తెగిపోవడంతో..
భార్యతో విడాకులు తీసుకున్న సంతోషంలో ఓ యువకుడు బంగీ జంప్ చేశాడు. అయితే అది వికటించింది. తాడు ఒక్క సారిగా తెగిపోయింది. దీంతో అతడికి తీవ్రగాయాలై హాస్పిటల్ పాలయ్యాడు.
అతడికి 22 ఏళ్లు. అప్పటికే పెళ్లయ్యింది. కానీ పలు కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు. కొంత కాలం తరువాత విడాకులు మంజూరయ్యాయి. దీంతో ఎంతో సంతోషించాడు. ఈ ఆనందంలో తనకు నచ్చిన పనులన్నీ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో బంగీ జంప్ చేశాడు. అయితే తాడు తెగిపోవడంతో తీవ్ర గాయాలతో హస్పిటల్ లో చేరాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా వివాహం అయ్యింది. కొంత కాలం ఆ దంపతులు కలిసి ఉన్నారు. తరువాత భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరువాత తనకు నచ్చిన ప్రదేశాలు తిరగాలని, సాహసాలు చేస్తూ ఆనందంగా ఉండాలి అనుకున్నాడు. ఈ క్రమంలో అతడు అనేక ప్రదేశాలు తిరిగాడు. సాహసాలు చేస్తూ వచ్చాడు.
కొన్ని రోజుల తరువాత బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్ లో పాల్గొనాలని భావించాడు. అందులో భాగంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. అయితే అనుకోకుండా రాఫెల్ కు సపోర్ట్ గా ఉన్న తాడు తెగిపోయింది. దీంతో అతడు కింద ఉన్న నీటి చెరువులో పడిపోయాడు. చాలా ఎత్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది రాఫెల్ ను హాస్పిటల్ కు తరలించారు. అతడికి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం ఈ రాఫెల్ కోలుకున్నాడు. దీంతో ఫిబ్రవరిలో చోటు చేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.