హైదరాబాద్:  పార్టీ కార్యక్రమాల్లో  మొదటి వరుసలో కూర్చొనే అవకాశం కేటీఆర్‌కు  దక్కింది.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శుక్రవారం నాడు కేటీఆర్ పాల్గొన్నారు.

ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన  టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాల్గొన్నారు.పార్టీ కార్యవర్గం కేటీఆర్ ను అభినందిస్తూ తీర్మానించింది. పార్టీ చీఫ్ కేసీఆర్‌ కాళ్లు మొక్కి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను కేటీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పగిస్తూ కేటీసఆర్ నిర్ణయం తీసుకొన్నారు.పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటీఆర్ కు  అప్పగించారు.  పార్టీ  సమావేశంలో  కేసీఆర్ పక్క సీటులో  కేటీఆర్ కూర్చొన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌కు  కేసీఆర్ పక్క సీటులో కూర్చొన్నారు.

పార్టీలో ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేయాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. రేపటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భవిష్యత్తులో పార్టీని ఎలా నడపాలనే విషయమై చర్చించనున్నారు.

పార్టీలో  తన ప్రభావాన్ని కేటీఆర్ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. పార్టీలో మార్పులు, చేర్పులపై కూడ కేటీఆర్ తన అభిప్రాయాలను రేపటి నుండి మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీలో ఒకరికి ఒకే పదవిని ఇవ్వనున్నట్టు ఇప్పటికే పార్టీ నేతలకు  టీఆర్ఎస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

కేటీఆర్ మీకు అందుబాటులో ఉంటారు: కేసీఆర్

తండ్రి వారసుడు: రచ్చ గెలిచి ఇంట గెలిచిన కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణ భవన్‌కు కేటీఆర్

కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)

హరీష్ అభినందనలు: థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..