హైదరాబాద్: రేపటి నుండి  మీ అందరికీ  కేటీఆర్ అందుబాటులో ఉంటారని టీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్  ప్రకటించారు. పార్టీ కోసం కేటీఆర్ పూర్తి సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు.

శుక్రవారం నాడు  తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో  కేటీఆర్ ఈ సమావేశంలో తొలిసారిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రానున్నందున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానిక ఇంచార్జీని నియమించాలని పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు. రేపటి నుండి మీ అందరికీ అందుబాటులో ఉంటారని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నామినేటేడ్ పోస్టులను ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రానున్న ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్  పార్టీ నేతలకు సూచించారు.  ప్రతి జిల్లా కేంద్రంలో  అత్యాధునిక హంగులు, టెక్నాలజీతో పార్టీ కార్యాలయాలను నిర్మించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

గ్రామ స్థాయిలో  పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం నేతలంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని  కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. రేపు మరోసారి టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరగనుంది.

గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియమించాలని నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తీరాలని  ఆయన కోరారు.

పంచాయితీ రాజ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జీలు బాధ్యులు చూడాలని కేసీఆర్ ఆదేశించారు. వారంలో కనీసం 3 రోజుల పాటు పాటు  కేటీఆర్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

తండ్రి వారసుడు: రచ్చ గెలిచి ఇంట గెలిచిన కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణ భవన్‌కు కేటీఆర్

కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)

హరీష్ అభినందనలు: థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..