హైదరాబాద్:  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్‌ శుక్రవారం నాడు మధ్యాహ్నం టీఆర్ఎస్ భవన్‌కు వచ్చారు. టీఆర్ఎస్ భవన్‌కు కేటీఆర్ రాగానే  ఆ పార్టీ మహిళ విభాగం నేతలు హరతిచ్చి స్వాగతం పలికారు.

పార్టీ కార్యాలయ ఆవరణలో  ఉన్న తెలంగాణ తల్లి విగ్రహనికి  కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఆ తర్వాత పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కేసీఆర్ వివరించనున్నారు.  

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించిన తర్వాత జరిగే ఈ సమావేశం మొదటిది.దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు.
 

సంబంధిత వార్తలు

కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)

హరీష్ అభినందనలు: థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..