Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెడతాం....కానీ... : కేటీఆర్

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర వహించడం ఖాయమని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. దేశంలో ఆంధ్ర ప్రదేశ్ కూడా అంతర్భాగమే కాబట్టి అక్కడ కూడా తమ రాజకీయాలుంటాయన్నారు. కానీ అక్కడ తాము ఎలాంటి పాత్ర పోషిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేటీఆర్ వెల్లడించారు. 

ktr comments on ap politics
Author
Hyderabad, First Published Dec 15, 2018, 3:12 PM IST

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర వహించడం ఖాయమని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. దేశంలో ఆంధ్ర ప్రదేశ్ కూడా అంతర్భాగమే కాబట్టి అక్కడ కూడా తమ రాజకీయాలుంటాయన్నారు. కానీ అక్కడ తాము ఎలాంటి పాత్ర పోషిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేటీఆర్ వెల్లడించారు. 

చంద్రబాబు పనిచేసేది దేశం కోసం కాదని కేవలం తెలుగు దేశం కోసమేనంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ పెడరల్ ప్రంట్ పేరుతో భారత దేశం కోసం పనిచేయడానికి సిద్దమవుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, రాహుల్ లు కలిసి హైదరాబాద్ లో తనకంటే ఎక్కువ తిరిగారని గుర్తుచేశారు. వారు తమకు తాము జాతీయ నాయకులుగా ప్రచారం చేసుకుంటున్నారని...నిజానికి వాళ్లు గల్లీ లీడర్లంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.  

తెలంగాణ ఎన్నికలు ప్రోగ్రెస్ కు కాంగ్రెస్ కు మధ్య జరిగాయని...అందులో టీఆర్ఎస్ ప్రోగ్రెసే గెలిచిందన్నారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగానే, హైదరాబాద్ లో ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి చేస్తారని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కూడా ఇక్కడే వుంటూ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారని  కేటీఆర్ గుర్తు చేశారు. 

ఎన్నికల్లో హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం, పార్టీ కీలకంగా వ్యహరిస్తాయని అన్నారు. ప్రభుత్వ నిర్వహణను, జాతీయ రాజకీయాల బాధ్యతలు ఉండటంతో  పని భారాన్ని తగ్గించుకోడానికే కేసీఆర్  తనకు పార్టీ బాధ్యతలు అప్పగించారని కేటీఆర్ తెలిపారు. తాను పార్టీలో చేరి 12 ఏళ్లు అవుతోందని...ప్రత్యక్షంగా నాలుగు, పరోక్షంగా ఎనిమిది ఎన్నికలు చూశానని అన్నారు. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో తానేంటో నిరూపించుకున్నాను కాబట్టే ఆ పదవి వరించిందని కేటీఆర్ వెల్లడించారు. 

టీఆర్ఎస్ పార్టీని వందేళ్ల పాటు చెక్కచెదరకుండా  తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల యువతకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 

 
సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ శాసించలేదా...? అలాగే కేసీఆర్ శాసిస్తారు: కేటీఆర్

మావల్లే: లగడపాటిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

సిఎంగా రాబోతున్నారా అని అడిగితే కేటీఆర్ స్పందన ఇదీ...

 

Follow Us:
Download App:
  • android
  • ios