Asianet News TeluguAsianet News Telugu

అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా అని అడిగితే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్‌ పేరుతో హడావిడి చేస్తున్నారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. 

KTR shocking comments on Chandrabbau
Author
Hyderabad, First Published Dec 15, 2018, 1:45 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ నేత కారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  

చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా అని అడిగితే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్‌ పేరుతో హడావిడి చేస్తున్నారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలని ఆయన అన్నారు.
 
బీజేపీని బూచిగా చూపి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో అర్థవంతమైన రాజకీయం కోసమే కేసీఆర్ ప్రయత్నమని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌ వైపు ఉన్నారని అంటూ తమది కాంగ్రెస్‌, బీజేపీకి సంబంధంలేని ఫ్రంట్‌ ఆయన అన్నారు. 

జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలేనని, పార్టీలన్నింటినీ ఏకం చేస్తామని ఆయన చెప్పారు ఏపీలో టీడీపీయే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయని అన్నారు. ఎపి రాజకీయాలు అనూహ్యంగా మారతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
వచ్చే ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా అమలు చేస్తామని కే ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో 16 లోకసభ స్థానాలు గెలిచి కేంద్రాన్ని శాసిస్తామని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios