హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా నియమితులైన తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలను హైదరాబాద్‌‌ నుంచి ఎలా శాసిస్తారు? అన్న ప్రశ్నకు చాలా సింపుల్ అంటూ సమాధానం ఇచ్చారు. 

ఈ సందర్భంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. ఎన్టీఆర్ నెరపిన జాతీయ రాజకీయాలను కేటీఆర్ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్ నుంచి కూడా శాసించవచ్చని గతంలో ఎన్టీఆర్ దేశ, రాష్ట్ర రాజకీయాలను ఏకకాలంలోనే శాసించారని గుర్తు చేశారు. 

కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి మరో 15 ఏళ్లపాటు అవసరం ఉందన్నారు. తాము భారతదేశం కోసం పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. 

అవకాశవాద పొత్తులు కాకుండా ఓ గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు ఎన్టీఆర్  హైదరాబాద్‌ నుంచే జాతీయస్థాయిలో రాజకీయాలను శాసించారని.. తాము కూడా ఇక్కడ నుంచే దేశ రాజకీయాలను శాసిస్తామన్నట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మావల్లే: లగడపాటిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్