హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యహరిస్తారని ఆయన తనయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని చెప్పారు. 

ప్రెస్ క్లబ్ లో శనివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో మే లేదా జూన్‌లో మీట్‌ ది ప్రెస్‌కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్‌ రాబోతున్నారా ప్రశ్నించగా అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. 

జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలోనే కూర్చుని చేయాలని లేదని, అలాంటి నిబంధన ఏదీ లేదని, రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్‌ నుంచి శాసించవచ్చునని అన్నారు. తెలంగాణ సీఎంగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయవచ్చునని అన్నారు. 


తెలంగాణ రాష్ట్రానికి మరో పది, పదిహేనేళ్లు కచ్చితంగా కేసీఆర్‌ నాయకత్వం అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. తనతోపాటు, లక్షలాది మంది కార్యకర్తలు బలంగా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి తనకు ఇచ్చారని చెప్పి మరేదో పెద్ద పదవి తనకు ఇస్తారని ఊహించి రాసి ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని కేటీఆర్ అన్నారు.  తన సోదరి, నిజామాబాద్‌ ఎంపీ కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

సంబంధిత వార్తలు

అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

మావల్లే: లగడపాటిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెడతాం....కానీ... : కేటీఆర్

ఎన్టీఆర్ శాసించలేదా...? అలాగే కేసీఆర్ శాసిస్తారు: కేటీఆర్

ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ (ఫొటోలు)