హైదరాబాద్: తనను కూడ తన భర్తను ఎన్‌కౌంటర్ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలని  చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత చెన్నకేశవులు భార్య  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.  ఈ తరహా ఘటనలు ఎన్నో జరిగాయని ఆమె గుర్తుచేశారు.  ఎందుకు తన భర్తను ఎన్‌కౌంటర్ చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : వారం రోజుల క్రితం రాళ్లు, నేడు పోలీసులపై పూల వర్షం

రేప్ చేసిన నిందితులు ఎందరు ఈ రకమైన శిక్షకు గురయ్యారని ఆమె ప్రశ్నించారు.  ఇప్పుడు తాను ఏం చేయాలని ఆమె రోధించారు.  తనను కూడ తన భర్తను చంపిన ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలని  ఆమె కోరారు.

Also read:మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది: నిందితుల ఎన్‌కౌంటర్ పై దిశ ఫ్యామిలీ

తన  భర్త లేకుండా తాను ఎలా బతకాలని ఆమె ప్రశ్నించారు. గుడిగండ్ల గ్రామంలో నిందితుల కుటుంబసభ్యులను చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లేందుకు పోలీసులు గుడిగండ్ల గ్రామానికి వెళ్లారు. 

Also read:సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్ స్థలానికి నిందితుల కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. కుటుంబసభ్యులను తీసుకొని ఎన్ కౌంటర్ ప్రదేశానికి తీసుకురానున్నారు. గత నెల 27వ తేదీన దిశను నిందితులు గ్యాంగ్‌రేప్‌ చేసి హత్య చేశారు.