Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : వారం రోజుల క్రితం రాళ్లు, నేడు పోలీసులపై పూల వర్షం

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో పోలీసులపై పూలుచల్లి తమ హర్షం వ్యక్తం చేశారు.

Just for disha: People sprinkled flowers on the police after accused encounter
Author
Hyderabad, First Published Dec 6, 2019, 11:13 AM IST


హైదరాబాద్: దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో  తెలంగాణ పోలీసులపై ముఖ్యంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు, నేడు పూలు చల్లి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Also read:మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది: నిందితుల ఎన్‌కౌంటర్ పై దిశ ఫ్యామిలీ

గత నెల 27వ తేదీన  శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. నిందితులను ఒక్క రోజులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. 
నిందితులను షాద్‌నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకొన్న ప్రజలు పెద్ద ఎత్తున గత నెల 29వ తేదీన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. పెద్ద ఎత్తున గుమికూడిన ప్రజలను అదుపు చేయడం ఆ సమయంలో పోలీసులకు కష్టంగా మారింది.

Also read:సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్

పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రజలు ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో పోలీసులపై  స్థానికులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరుపై ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేశారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

దిశ అదృశ్యమైన వెంటనే పోలీసులకు  పేరేంట్స్ ఫిర్యాదు చేసిన ఆ సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.

షాద్‌నగర్ కోర్టు దిశ నిందితులను పోలీసుల కస్టడీకి ఇచ్చింది. పోలీసుల కస్టడీకి ఇచ్చిన రెండోరోజున పోలీసుల నుండి తప్పించుకొనేందుకు నిందితులు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు ఉదయం నిందితులు చటాన్‌పల్లి సమీపంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో  నిందితులు పారిపోయే క్రమంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

Also read:దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

చటాన్‌పల్లిలోని అండర్ పాస్ బ్రిడ్జి  వద్ద నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పెద్ద ఎత్తున  చటాన్‌పల్లికి చేరుకొన్నారు. హైద్రాబాద్-బెంగుళూరు జాతీయ రహాదరిపై నిలబడ్డారు. జాతీయరహదారిపై టపాకాయలు కాల్చి తమ సంబరాలను తెలిపారు. 

జాతీయ రహదారిపై నుండి చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి కింద ఎన్‌కౌంటర్ ప్రదేశంలో ఉన్న పోలీసులపై పూలు చల్లి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు పోలీసులపై పూలు చల్లారు. ఎన్‌కౌంటర్ స్థలంలో ఉన్న పోలీసులను ప్రజలు తమ భుజాలపై ఎత్తుకొని నృత్యం చేశారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినదించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు అనుకూలంగా కూడ ప్రజలు పెద్ద ఎత్తున అభినందిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలిపారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios