ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?
డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు కేసు ఘటన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న స్వప్నిక, ప్రణీత యాసిడ్ దాడిని మరోసారి గుర్తు చేస్తోంది.
హైదరాబాద్: అమ్మాయిలపై దాడులు చేసిన వారిని కఠినమైన శిక్షలు ఉంటాయనే భయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురు ఎన్‌కౌంటర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయింది.
Also read:ప్రియాంక రెడ్డి ఘటన: తన తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా...?
ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్ పనిచేస్తున్నారు. ఈ ఘటనను ఆనాడు కొందరు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తర్వాత మరోసారి ఇదే చర్చ ప్రారంభమైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్ ఉన్నాడు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతులపై యాసిడ్ పెద్ద సంచలనం కలిగింది. వరంగల్ లో నివాసం ఉంటున్న స్వప్నిక, ప్రణీతలు స్నేహితులు. స్వప్నిక ఇంటికి సమీపంలో ఉండే శ్రీనివాస్ ఆమెను నిత్యం వేధించేవాడు. స్వప్నిక మాత్రం శ్రీనివాస్ ఆమెను ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు.
Also read: నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్
అయితే స్నప్నిక మాత్రం శ్రీనివాస్ గురించి పట్టించుకోలేదు. కాలేజీని నుండి స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్వప్నిక స్కూటీపై ఇంటికి వస్తున్న సమయంలో పట్టపగలే శ్రీనివాస్ స్వప్నికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2008 డిసెంబర్ 10వ తేదీన చోటు చేసుకొంది.
వరంగల్ లోని కిట్స్ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. స్వప్పిక వరంగల్ లో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతలను హైద్రాబాద్‌కు తరలించారు. హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వప్నిక మృతి చెందింది. ప్రణీత మాత్రం ప్రాణాలతో బయటపడింది.
స్వప్నిక , ప్రణీలతపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ వాళ్లకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ తో పాటు అతని స్నేహితులు హరికృష్ణ, సంజయ్‌లు ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు. శ్రీనివాస్ వద్ద ఆయుధాలు ఎలా వచ్చాయనే దర్యాప్తును పోలీసులు చేపట్టారు. ఆ సమయంలో ఆయుధాలు దాచిన స్థలాన్ని చూపిస్తామని పోలీసులను తీసుకెళ్లారు.
Also read: రేప్ చేస్తే ఇక ఉరి శిక్షే... నూతన చట్టం చేసే పనిలో కేంద్రం
తాము దాచుకొన్న ఆయుధంలో తమపై దాడికి దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్వప్నిక, ప్రణీతలపై దాడికి పాల్పడిన వారు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా వీసీ సజ్జనార్ ఉన్నారు.
డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. ఈ నలుగురు నారాయణపేట జిల్లాకు చెందినవారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య చోటు చేసుకొన్న ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకొంది.
వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య విషయం వెలుగు చూసిన సమయంలో మరోసారి సజ్జనార్ ఏం చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిందితులను ఎన్‌కౌంటర్ చేయించిన విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.
ఈ ధైర్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.ఏ ఒక్క అధికారి కూడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉండదని చెబుతున్నారు.ఏ ఒక్క అధికారి కూడ ఈ రకమైన నిర్ణయాలు తీసుకొంటారా అనే చర్చ కూడ సోషల్ మీడియాలో సాగుతోంది.
వరంగల్ లో చేసినట్టుగా డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారా అనే చర్చ తెర మీదికి తెచ్చారు. అయితే ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలను వ్యతిరేకించేవారు, సమర్ధించేవారు ఉన్నారు.
వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ బృందాన్ని ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో కూడ ఈ ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించిన వారు కూడ లేకపోలేదు. సమర్ధించినవారు కూడా ఉన్నారు.
అప్పట్లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిన వెంటనే విద్యార్ధులు తమ భుజాలపై ఆనాటి ఎస్పీ సజ్జనార్‌ను ఎత్తుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఈ తరహా ఘటనలు ఆగలేదు. దీంతో ఎన్‌కౌంటర్లు సరికాదని వాదించేవారు కూడ లేకపోలేదు.
అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఈ తరహా ఘటనలు దోహదపడతాయనే చర్చలు కూడ లేకపోలేదు.అయితే ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదనే వాదించేవారు లేకపోలేదు.
ప్రస్తుతం ఈ నిందితులను వెంటనే శిక్షించాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి. డాక్టర్ ప్రియాంక రెడ్డి కాలనీవాసులు ఈ విషయమై సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.