తెలంగాణలో ఎన్నికలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత దేశంలోనే అభివృద్ధిలోనే అగ్రభాగాన ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హుస్నాబాద్: తెలంగాణలో ఎన్నికలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత దేశంలోనే అభివృద్ధిలోనే అగ్రభాగాన ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హుస్నాబాద్‌లో ఆశీర్వాద సభతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తోందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జీవనం విధ్వంసమైందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు.జానారెడ్డి నీకు నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ కు ప్రచారం చేయాలని కేసీఆర్ సవాల్ విసిరారు.
రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తే తానే టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేస్తానని సీఎల్పీ నేత జానారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలోనే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత తమకు దక్కిందన్నారు.
ఈ విషయం జానారెడ్డికి కన్పించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కంటి పరీక్షలు జరుగుతున్నాయని... అవసరమైతే కంటికి పరీక్షలు చేయించుకోవాలని ఆయన జానారెడ్డికి సూచించారు.
టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు భరోసా వచ్చిందన్నారు. ఎన్నికలు వస్తే అలవికానీ హమీలు ఇస్తున్నారని ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు.. గులాబీ నేతల కారణంగానే పెన్షన్ రెండువేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హమీలు ఇస్తున్నారని చెప్పారు.
50 ఏళ్లలో ఎప్పుడూ కూడ వెయ్యి రూపాయాల పెన్షన్ కూడ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు కాంగ్రెస్ నేతలకు రాలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.ఈ పేదరికం, దరిద్రానికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమన్నారు. . ప్రాజెక్డుల రీ డిజైనింగ్ చేయడం తప్పని కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
కాంగ్రెస్ నేతలకు ఢిల్లీని, సమైక్య పాలకులను చూస్తే లాగులు తడుస్తాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు.. ఢిల్లీకి బానిసలుగా కావాలని కాంగ్రెస్ నేతలు కోరుకొంటున్నారని కేసీఆర్ చెప్పారు .కాంగ్రెస్ నేతలు పెత్తనాన్ని ఢిల్లీకి అప్పగించాలని చూస్తున్నారని.. ఢిల్లీకి బానిసలుగా కోరుకొనే పాలకులు కావాలో... తెలంగాణకు బాగు చేసుకొనే పాలకులు కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
ఎన్నికలకు పోదాం.. సిద్దమా అంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సవాల్ చేశాను.. ముందస్తు ఎన్నికలకు సిద్దమని అన్ని పార్టీలు ప్రకటించాయని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లగానే అన్ని పార్టీలు హైద్రాబాద్‌లో గోడలు పట్టుకొని చూస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీ రద్దు చేయగానే అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు. అసెంబ్లీ రద్దు చేస్తే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పాలనలో ఎన్‌కౌంటర్లు లేవన్నారు. మనిషులను కాల్చిచంపడం లేదన్నారు. పేకాట క్లబ్బులు లేవన్నారు. ఫ్యాక్షనిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పేకాట క్లబ్బులు వస్తాయన్నారు. కరెంటు కోతలు ప్రారంభమౌతాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం సాధ్యం రాదన్నారు.
మరోసారి తమకు అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు. హుస్నాబాద్ దీవేన వృధా కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే ఆకలితో ఉన్నారని చెప్పారు. దొరికిందే తడవుగా తింటారన్నారని కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలను ఆయన సంధించారు.
మరోసారి అధికారాన్ని ఇస్తే కోటి ఎకరాలకు సాగు నీటిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తమ పాలన సాగిస్తోందన్నారు. చిన్న ఉద్యోగులతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వెట్టి చాకిరీ చేయించుకొన్నారని ఆయన చెప్పారు. తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడితే సంపాదనను పెంచుకొంటూ చిన్న ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సతీష్ అభివృద్ది చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సతీష్ ను మరోసారి హుస్నాబాద్ నుండి గెలిపించాలని కేసీఆర్ కోరారు. హుస్నాబాద్ కోసం పనిచేస్తున్నామన్నారు.
ఈ వార్తలు చదవండి
కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు పెడుతున్న కోమటిరెడ్డి
.కేసీఆర్ వ్యూహం: డీఎస్ లోటు సురేష్ రెడ్డితో భర్తీ
దురదృష్టకరం: కేసీఆర్‌కు సీఈసీ చురకలు
Last Updated 9, Sep 2018, 2:13 PM IST