ఆదిలాబాద్: ఎన్నికల వేళ ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయని ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారని వాటిని నమ్మి మోసపోవద్దని గులాబీ బాస్ కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ 58 ఏళ్ల కాంగ్రెస్,టీడీపీ పాలన, నాలుగున్నరేళ్ళ టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు. 

కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకంతో రైతులకు బంధువుగా మారానని తెలిపారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే  గిరిజన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గోండు,లంబాడ,కాగితపు లంబాడీలు మా తండాలో మా రాజ్యం అంటూ పోరాటం చేసినా ఏ పార్టీలు పట్టించుకోలేదని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పట్టించుకుందన్నారు. బోథ్‌ నియోజకవర్గంలోనే కొత్తగా 115 పంచాయతీలు అయ్యాయన్నారు.

3500 పంచాయితీలలో ఎస్టీలు సర్పంచ్ లు అయ్యే అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అయితే కేంద్రం కానీ మోదీకానీ పట్టించుకోలేదన్నారు. 

మోదీ చక్కగా మాటలు చెప్తారే కానీ పనులు చెయ్యరన్నారు. అధికారమంతా ఢిల్లీలో పెట్టుకుని కర్రపెత్తన చెలాయించాలన్నదే మోదీ ఆలోచన అంటూ విమర్శించారు. తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తి వస్తుందని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ మెడలు వంచి ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

14ఏళ్లు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చానని తెలిపారు. అలాగే ఎస్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్లు సాధిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు సహకరించి మళ్లీ టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు సాధించి తీరుతామని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ లేదు సాగునీరు, తాగునీరు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తాను బాధపడ్డానని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను రైతునేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ హయాంలో నా మోటర్లు కాలిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని గమనించాలని సూచించారు. ఇకపై ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదని హామీ ఇచ్చారు. 

కేసీఆర్ కిట్స్, కళ్యాణ లక్ష్మీ, అమ్మఒడి వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేశామని తెలిపారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ అంధకారమేనన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే, పెన్షన్లు డబుల్‌ చేస్తామని హామీ ఇచ్చారు.
  
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి పీడ మళ్లీ తెలంగాణకు అవసరమా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రోడు అని ఆయన్ను మళ్లీ తెలంగాణకు తోలుకొస్తుంది కాంగ్రెస్ అని విమర్శించారు. కత్తి ఆంధ్రోడు ఇస్తాడని పొడిచేటోడు తెలంగాణ వాడు అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. 

దెబ్బకొడితే దెయ్యం వదలాలి అన్నట్లు రాజకీయ చైతన్యం ఓటుతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి చంద్రబాబు వంటి దెయ్యాన్ని వదిలించుకోవాలని సూచించారు. వలస పార్టీల పాలన మనుకు అవసరం లేదని చంద్రబాబు లాంటి పీడ మనకి వద్దని కేసీఆర్ ధ్వజమెత్తారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్