Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు మరో షాక్‌కు కేసీఆర్: అసెంబ్లీలోనూ మండలి ప్లాన్

తెలంగాణ అసెంబ్లీలో కూడ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.శాసనమండలిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన టీఆర్ఎస్ అసెంబ్లీలో కూడ అదే వ్యూహన్ని అమలు చేయనుంది.

kcr plans to attract congress mlas in telangana
Author
Hyderabad, First Published Dec 23, 2018, 5:17 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కూడ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.శాసనమండలిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన టీఆర్ఎస్ అసెంబ్లీలో కూడ అదే వ్యూహన్ని అమలు చేయనుంది.

ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు 88 సీట్లు దక్కాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్‌లో చేరారు. ఖమ్మం జిల్లా వైరా నుండి విజయం సాధించిన రాముల్ నాయక్ , కరీంనగర్ జిల్లాలోని  రామగుండం నుండి విజయం సాధించిన కోరుకంటి చందర్ కూడ  టీఆర్ఎస్ గూటికి చేరారు.

కాంగ్రెస్ పార్టీ 19, టీడీపీ రెండు సీట్లలో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోనే రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. సత్తుపల్లి నుండి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య, ఆశ్వరావుపేట నుండి విజయం సాధించిన  మచ్చా నాగేశ్వర్ ‌రావులను టీఆర్ఎస్‌లో చేరేలా టీఆర్ఎస్‌ నేతలు గాలం వేస్తున్నారు.

సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ లో చేరితే  మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం.  పైకి సండ్ర టీడీపీలోనే కొనసాగుతానని చెబుతున్నా ఈ నెల 26న,ఆయన టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఆశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు మాత్రం తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలోని 19  మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్‌ కన్నేసింది. ఇప్పటికే సుమారు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారంలో ఉంది.

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను  తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలను టీఆర్ఎస్ సీరియస్ గా చేస్తోంది.అసెంబ్లీలో కూడ కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా కూడ లేకుండా చేయాలని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు.

గత టర్మ్‌లో  టీడీపీ శాసనసభపక్షాన్ని ఏ రకంగా టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అదే తరహాలో ఈ దపా కాంగ్రెస్ పార్టీని కూడ దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్  ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని  ప్రచారంలో ఉంది. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అవసరం ఉంది.

మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల కోసం  టీఆర్ఎస్ నేతలు  ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరాలని  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  టీఆర్ఎస్ గాలం వేస్తోంది. కనీసం 12 నుండి 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ఎల్పీలో  విలీనం చేయాలని  కోరితే ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ కాంగ్రెస్  పార్టీకి  చెందిన  12 లేదా 14 మంది టీఆర్ఎస్‌లో చేరితే  కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడ దక్కదు.  టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో  కూడ  టీఆర్ఎస్ టచ్‌లో ఉంది. తెలంగాణ అసెంబ్లీలో కూడ కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా లేకుండా చేయాలని తొలుత ప్లాన్ చేస్తోంది.  ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభలో లేకుండా చేయాలనే ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

మండలిలో సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం: హైకోర్టుకు కాంగ్రెస్

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios