మనుషులు ఉంటారు పోతారు కానీ వ్యవస్థలు శాశ్వతం  కాదన్నారు. ఎవరో ఒక వ్యక్తి చెప్పినట్లు చేయడం సబబు కాదని తాము ఛైర్మన్‌కు తెలిపినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. 2014లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాల్సిందిగా తాము లేఖలను ఇచ్చామని, అలాగే 2016 జూన్‌లో ఫరూఖ్ హుస్సేన్, ప్రభాకర్‌లపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరామని అలీ గుర్తు చేశారు.

దామోదర్ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని మూడు రోజుల కిందట కోరామని.. కానీ వాటిని ఛైర్మన్ పట్టించుకోలేదన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినప్పుడు విలీనానికి స్పీకర్ అభ్యంతరం తెలిపారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.

ఇలాంటి చర్యల ద్వారా రాజ్యాంగంతో పాటు ప్రజాప్రతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతలకు సంబంధించిన పిటిషన్లను రెండు గంటల్లోగా ఆమోదించి.. తాము రెండేళ్ల క్రితం నుంచి ఇచ్చిన నోటీసును మాత్రం పట్టించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.

దామోదర్ రెడ్డి, ఫరూఖ్ హూస్సేన్‌లపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరినప్పటి నుంచి వారిద్దరూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని అలాంటి వ్యక్తులు సీఎల్పీలో భాగమెలా అవుతారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఏపీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు చట్టాన్ని రక్షిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్ధితి లేదన్నారు.  

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్