రాష్ట్రానికి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే లక్ష్యంతో శాసనమండలిని ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం ఆశ్చర్యపడేలా పరిణామాలు జరగడం బాధాకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు చర్యలు చేపట్టారు.

ఎంఎస్ ప్రభాకర్‌‌పై అనర్హత ఓటు వేయాల్సిందిగా 2016లో శాసనమండలి ఛైర్మన్‌ను కలిశాం. అలాగే ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఈ నెల సీఎల్పీ సమావేశం జరిపినట్లుగా చెబుతున్నారు. కానీ అలాంటి సమావేశం జరుపుకునేందుకు వారికి ఎలాంటి అధికారం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో లేరు, ఇద్దరు కొత్తగా అమ్ముడుపోయారు. వీరంతా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా సమావేశం జరుపుకున్నామని ఛైర్మన్‌కు లేఖ ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు. వీరి వెనుక ఎవరున్నారు..ఎవరు చేయిస్తున్నారు మొత్తం తెలంగాణ సమాజం గమనించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్‌లో లేని వాళ్లు.. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయమని చెప్పడం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. రెండేళ్ల కిందట తాము ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఛైర్మన్‌ను కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. 

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు