తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. శాసనమండలిలోని కాంగ్రెస్ ఎల్‌పీని వీలినం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సంతోష్, ప్రభాకర్, దామోదర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కార్యాలయానికి చేరుకున్నారు.

నిన్న రాత్రి ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావడంతో పాటు.. ఈ రోజు పలువురు ఎమ్మెల్సీలు శాసనమండలి కార్యాలయానికి చేరుకోవడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి

అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎమ్మెల్సీలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంఎస్ ప్రభాకర్, దామోదర్ రెడ్డిలు గులాబీ కండువా కప్పుకున్నారు. తమను టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా ఈ నలుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు లేఖ ఇవ్వనున్నారు.