హైదరాబాద్: 2014-18 కాలంలో టీడీపీని ఏ రకంగా దెబ్బతీశారో, ఈ టర్మ్‌లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కేసీఆర్ అదే వ్యూహన్ని అనుసరిస్తున్నారు. చట్ట సభల్లో  విపక్షాలకు చోటు లేకుండా  చేసేందుకు కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.గతంలో టీడీపీని దెబ్బతీశారు.ఈ టర్మ్‌లో  కాంగ్రెస్ ‌పై  అదే వ్యూహన్ని అమలు చేస్తున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం రాజకీయ పునరేకీకరణ అవసరమని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణలో  ప్రధానంగా టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను  తమ పార్టీలో చేర్చుకొనే దిశగా  కేసీఆర్ అమలు చేసిన వ్యూహం విజయం సాధించింది.

తొలుత శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలపై కేసీఆర్ అనుసరించిన వ్యూహం సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  శాసనమండలిలో టీడీపీకి ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు అయితే టీడీపీకి చెందిన ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల్లో  ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని  లేఖ రాశారు.

2014 నవంబర్ 4వ తేదీన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్ రెడ్డి, ఎండి సలీం, వి.గంగాధర్ గౌడ్‌లు సమావేశమై తాము టీఆర్ఎస్‌లో విలీనం కావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా లేఖను శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్‌కు లేఖ రాశారు.

 మండలిలో టీడీపీకి అరికెల నర్సారెడ్డి, పోట్ల నాగేశ్వర్ రావులు ఉండేవారు. పోట్ల నాగేశ్వర్ రావు టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అరికెల నర్సారెడ్డి టర్మ్ పూర్తైన తర్వాత రేవంత్ రెడ్డితో  పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో  తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని ఆ సమయంలో టీడీపీ తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. అదే సమయంలో ఓటుకు నోటు కేసులో  రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది.

ఇక ఎమ్మెల్సీల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలపై  టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ వల విసిరింది. తొలుత తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి లు టీడీపీని వీడారు. ఆ తర్వాత ఒకరొకరుగా  టీడీపీ ఎమ్మెల్యేలు  ఆ పార్టీని వీడేలా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన ప్లాన్  విజయవంతమైంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేంద్ర నగర్  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌లు  టీడీపీని వీడారు. అప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ శాసనసభపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకొందని  వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అంతే కాదు హైకోర్టులో  కేసు కూడ వేశారు.

అయితే  టీడీపీ శాసనసభపక్ష నేతగా ఉన్న దయాకర్ రావు పార్టీ మారారు. టీఆర్ఎస్‌లో చేరడంతో  గతంలో టీడీపీని వీడి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు  అప్పటి స్పీకర్ మధుసూధనాచారికి ఓ లేఖ రాశారు. 2014 నవంబర్ మాసంలో ఈ లేఖను అందించారు. టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నామని లేఖ ఇచ్చారు.

ఈ పరిణామంతో  చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డిని  టీడీపీ శాసనసభ పక్ష నేతగా చేస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  కోరారు.   రాజ్యాంగంలోని 10వ, షెడ్యూల్‌లోని 4వ పేరా ప్రకారంగా టీడీపీ శాసనసభపక్షాన్ని  టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నామని దయాకర్ రావు ఆనాడు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు.

ఈ లేఖను రాజ్యాంగంలోని 10వ, షెడ్యూల్‌ను అతిక్రమించేలా  ఉందని రేవంత్ రెడ్డి ఆ సమయంలో స్పీకర్ కు లేఖ ఇచ్చారు.    రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్యలు అసెంబ్లీలో మిగిలారు. అయితే గత ఏడాదిలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలుగా వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్యలు మాత్రమే మిగిలారు.

ఈ దఫా ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిర్యాలగూడ నుండి ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. సత్తుపల్లి నుండి  టీడీపీ అ:భ్యర్థిగా బరిలో దిగిన సండ్ర వెంకటవీరయ్య మరోసారి  విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

గత టర్మ్‌లో టీడీపీని చట్టసభల్లో లేకుండా ఏ రకమైన వ్యూహన్ని కేసీఆర్ అనుసరించారో   ఈ దఫా కూడ కాంగ్రెస్ పట్ల కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే  శాసనమండలిలో నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌ఎల్పీలో తమను విలీనం చేయాలని కోరుతూ శుక్రవారం నాడు ఇచ్చిన లేఖ ఆధారంగా మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం శాసనమండలి సెక్రటరీ  బులెటిన్ విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్