Asianet News TeluguAsianet News Telugu

మండలిలో సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం: హైకోర్టుకు కాంగ్రెస్

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని  టీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్  పార్టీ  నిర్ణయం తీసుకొంది

congress plans to file petition in highcourt over merger clp in trslp
Author
Hyderabad, First Published Dec 22, 2018, 5:50 PM IST

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని  టీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్  పార్టీ  నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ  ఈ విషయమై కోర్టులో  పిటిషన్ దాఖలు చేయనుంది.

శుక్రవారం నాడు  నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని  కోరుతూ  శాసనమండలి ఛైర్మెన్‌కు  లేఖను ఇచ్చారు.

ఈ లేఖ ఆధారంగా  శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ శాసనమండలి సెక్రటరీ నర్సింహచార్యులు  డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు.

నిబంధనలకు విరుద్దంగా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని  కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌ఎల్పీలో  విలీనం చేయాలని  మండలి ఛైర్మెన్ కు లేఖ రాయడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మండలిలో విపక్షనాయుడు షబ్బీర్ అలీలు మండలి ఛైర్మెన్ కు వినతి పత్రం సమర్పించారు. 

గతంలో  శాసనమండలిలో, అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలను  దృష్టిలో ఉంచుకొని  సీఎల్పీని  టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టుగా  గెజిట్ విడుదల చేసింది.

ఈ పరిణామాలపై  సోమవారం నాడు  కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు. శాసనమండలి ఛైర్మెన్ తీసుకొన్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం  చేయాలని కోరనున్నారు. అయితే ఈ విషయమై హైకోర్టు ఏ రకమైన  నిర్ణయం తీసుకొంటుందో చూడాలి

సంబంధిత వార్తలు

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios