కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రజల మధ్య విద్వేసాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) సెక్షన్లు కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
కరీంనగర్: ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని వివాదాస్పద వ్యాఖ్యల అంశం వెంటాడుతూనే ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని సీపీ కమలాసన్ రెడ్డి క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ వివాదం మాత్రం రగులుతూనే ఉంది.
గత నెల 23న కరీంనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాసా సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ డీసీపీ కమలాసన్ రెడ్డి అక్బరుద్దీన్ ప్రసంగంలో ప్రతీ పదాన్ని, వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎక్సపర్ట్ ట్రాన్స్ లేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది.
అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ లేవని తేల్చి చెప్పారు. ఈ ప్రసంగంపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేదని నిపుణులు పోలీసులకు సలహా సైతం ఇచ్చారు.
దాంతో సీపీ కమలాసన్ రెడ్డి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సీపీ కేసు నమోదు చేయకపోవడంతో కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రజల మధ్య విద్వేసాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) సెక్షన్లు కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
ఇకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని ఎక్సపర్ట్ ట్రాన్స్ లేషన్ కమిటీ, న్యాయ నిపుణుల సలహకమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ప్రసంగంపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేదని నిపుణులు పోలీసులకు సలహా సైతం ఇచ్చారు.
న్యాయనిపుణుల సలహా మేరకు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నట్లు సీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అక్బరుద్దీన్ ఓవైసీకి ఐపీఎస్ అధికారి క్లీన్ చిట్
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్: కేసీఆర్ స్పందించాలని డిమాండ్
కొందరు కావాలని చేస్తున్నారు... చట్టాన్ని ఉల్లంఘించలేదన్న అక్బరుద్దీన్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 2, 2019, 7:18 PM IST