హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే శక్తిలా మారుతున్నారంటూ ఆరోపించారు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అయిన రాజు రవితేజ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. 

శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని స్పష్టం చేశారు. జనసేన సిద్ధాంతాలకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని విమర్శించారు. 

పవన్ కళ్యాణ్ గతంలో లేరని పూర్తిగా మారిపోయారని అందువల్లే తాను పార్టీ వీడాల్సి వచ్చిందని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ లేదని రవితేజ అన్నారు. పార్టీలో అంతర్గతంగా పారదర్శకత లేదని విమర్శలు గుప్పించారు. 

పవన్‌ కళ్యాణ్ సొంత పార్టీ వాళ్లను పైకి రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం వేదికలను వాడుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీలోని సీనియర్లు సంతోషపడ్డారని రవితేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్ భాష పూర్తిగా మారిపోయిందని ఆరోపించారు. సమాజానికి ప్రమాదకరంగా మాట్లాడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కులాల మీద, మతాల మీద పవన్  అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

పాత పవన్ కాదు, ప్రమాదకర శక్తి.. ఇక ఉండలేను: జనసేనకు రాజు రవితేజ్ గుడ్‌బై...

అధికారం కోసం పవన్ తొందర పడుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాజు రవితేజ. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని కానీ అందుకు భిన్నంగా పార్టీలో పరిస్థితి దాపురించిందని వాపోయారు. 

పవన్ సున్నితమైన మనిషి అని అయితే తలలు నరికేస్తానని పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటే ఖండించకపోవడం బాధనిపించిందన్నారు. గతంలో కూడా పార్టీకి రాజీనామా చేశానని అయితే తిరిగి మళ్లీ చేరినట్లు తెలిపారు. కానీ ఈ సారి తిరిగి చేరేది లేదన్నారు. 

పవన్ కల్యాణ్ నిజ స్వరూపం బయటపడిందంటూ రవితేజ ధ్వజమెత్తారు. జనసేన పార్టీలో స్వేచ్ఛ లేదని అంతా తన కంట్రోల్ ఉండాలని పవన కల్యాణ్ కోరుకుంటారని చెప్పుకొచ్చారు. ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి ప్రవేశించామో మీరే ఆ వ్యాధిగా మారారు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా.. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని మీరు కోరారు. 

జగన్ లా పవన్ మారాలి, అప్పుడే..: బాంబు పేల్చిన ఎమ్మెల్యే రాపాక...

దాదాపు 12 ఏళ్లు మీ వెన్నంటే నడిచాడు. పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో మీతో చర్చించాను. పార్టీ కోసం ఎంతో చేశాను. మరెంతో చేద్దామనుకున్నాను. కానీ, మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి. హద్దుల్లేని అబద్ధాలతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు. 

మీరు చేసే ప్రసంగాలు అబద్ధాలు, అసభ్యకర భాషతో ఉంటున్నాయి. మీరెప్పుడూ ధర్మవంతమైన మనిషిగా కాలేరు. ఒక మంచి మనిషి నుంచి నిజాయితీలేని, కుట్రపూరితమైన మనిషిగా మారారు’ అంటూ రవితేజ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

నీకంటూ ఓ గుర్తింపు ఉంది, పరువు తీసుకోకు: పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే..