ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొఠారు అబ్బయ్య చౌదరి. పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎందుకు రౌతు సౌభాగ్య దీక్ష చేశారో చెప్పాలని నిలదీశారు. 

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం శ్రమిస్తుంటే పవన్ రైతు సౌభాగ్య దీక్ష చేయడంపై సెటైర్లు వేశారు. పవన్‌ రైతు దీక్ష దేనికోసం చేశారో అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు.  సీఎం జగన్ పై విమర్శలు చేసేందుకు, ప్రభుత్వంపై తన అక్కసును వెల్లగక్కేందుకే రైతు సౌభాగ్య దీక్ష చేపట్టినట్లు ఉందన్నారు. 

ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయపడదామన్న అత్యాసతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు అబ్బయ్యచౌదరిజ.  

పవన్ కళ్యాణ్ రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు.  

పవన్ కల్యాణ్ మీద జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్...
 
సీఎం వైయస్ జగన్ ను విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అద్భుతంగా పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పవన్ కళ్యాన్ ఎవరికి పనిచేస్తున్నారో అర్థమవుతుందన్నారు.  

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాలువలు ఆధునీకరణ చేయకపోయినా పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని నిలదీశారు. 

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కోట్లాది రూపాయలు తమ ప్రభుత్వం విడుదల చేసినా పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టిన చంద్రబాబును వదిలేసి నిధులు మంజూరు చేసిన వైసీపీని విమర్శించడంపై మండిపడ్డారు. 

పవన్ కళ్యాణ్ కు ఒక సినీనటుడుగా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి దీక్షలు చేసి ప్రజల్లో పరువు తీసుకోవద్దంటూ పవన్‌ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హితవు పలికారు.

నేను దీక్షలో..రాపాక అసెంబ్లీలో: షోకాజ్ నోటీసులపై పవన్ కళ్యాణ్..