MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

Weather Update : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు ఇవాళ కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసా..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 24 2026, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయి. వేసవి మొదలై ఎండలు మండిపోవాల్సిన వేళ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది... కొన్నిచోట్ల చిరుజల్లులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అయితే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఇటు సామాన్య ప్రజలను, వడగళ్ల వానలు అటు రైతులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చే అవకాశాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : Pixabay

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణం అవుతున్నాయి. గతవారం ఏకంగా రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి... ఇందులో ఒకటి ఇప్పటికే బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రం బలపడి భారీ వర్షాలకు కారణం అవుతోంది. ఈ అల్పపీడనానికి ఉపరితల ద్రోణి కూడా జతకలిసింది... దీంతో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

37
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Getty

తెలంగాణలో భారీ వర్షాలు

నిన్న(ఫిబ్రవరి 23, సోమవారం) తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిశాయి... రాత్రి కూడా కొనసాగాయి. ఇవాళ (ఫిబ్రవరి 24, మంగళవారం) కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రాబోయే రెండుమూడు గంటల్లో జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

47
హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్
Image Credit : Getty

హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్

ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది... ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో పొడి వాతావరణం ఉంటుందని... మధ్యాహ్నం నుండి మళ్లీ వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. వచ్చే రెండుమూడు గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

57
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Image Credit : Getty

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి... నారాయణఖేడ్, కొండాపూర్, సదాశివపేట్ పాటు పలు ప్రాంతాల్లో అర్థరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇక కామారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, భువనగిరి, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగాయి. హైదరాబాద్ లోని ఆల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

67
అత్యధిక వర్షపాతం ఇక్కడే
Image Credit : X/APSDMA

అత్యధిక వర్షపాతం ఇక్కడే

నేడు (ఫిబ్రవరి 24న) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 6 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

77
ఏపీలో వర్షాలు
Image Credit : Pixabay

ఏపీలో వర్షాలు

ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కనిపిస్తోంది... పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... నేడు విజయవాడలో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలకు కూడా వర్షసూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
తిరుపతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image2
Now Playing
Heavy Rain In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved