తెరపైకి తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం.. నాకు కనీస ఆహ్వానం అందలేదన్న గవర్నర్ తమిళసై.. ఏమైందంటే ?
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు కనీస ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళసై అన్నారు. ఈ విషయంలో అప్పుడు ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉన్నాయని అన్నారు. చెన్నైలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల నుంచి భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానిని ప్రధాని ప్రారంభించకూడదని, రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాము ఈ వేడుకకు దూరంగా ఉంటామని ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ విషయంలో గురువారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పార్లమెంటును రాష్ట్రపతి ప్రారంభించాలే ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. ఓ వైపు పార్లమెంట్ పైనే ఇంత చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ప్రేమ పేరుతో కూతురు వెంటపడుతున్నాడని బాలుడి హతమార్చిన తండ్రి.. ఎక్కడంటే ?
ఏమైందంటే ?
తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు కనీస ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళసై వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రతిపక్షాలు మనసు మార్చుకోవాలని, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు గురువారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళసై మాట్లాడారు. ఇటీవలే తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం జరిగిందని తెలిపారు. ఆ వేడుకకు తనను నేరుగా వచ్చి పిలవకపోయినప్పటికీ.. ఆహ్వానం కూడా రాలేదని చెప్పారు.
రాష్ట్రపతి రాజకీయతర వ్యక్తి అని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, కానీ ఆ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నాయని తమిళసై ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు గవర్నర్లకు కనీస గౌరవం ఇవ్వలేదని, అలాంటి పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతితో జరిపించడం లేదని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంతో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తీరుపై పరోక్షంగా ఆమె విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు చెన్నైలో చేయడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసే అవకాశం కలిగింది. దీంతో తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లైంది.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు బీఆర్ఎస్ వెళ్లాలా ? వద్దా అనే విషయంలో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పష్టతనివ్వలేదు. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తూ వస్తున్న బీఆర్ఎస్.. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఒక వేళ హాజరుకాకపోతే గవర్నర్ విషయంలో మీరు చేసిందేమిటని బీజేపీకి ప్రశ్నించే అవకాశం దక్కుతుంది. ఒక వేళ వెళ్తే.. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పరోక్షంగా మద్దతు తెలిపినట్టు అవుతుంది. ఈ విషయంలో ఎటు వెళ్లినా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి వరకు ఆ పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది.
కర్ణాటక కేబినెట్ విస్తరణ.. సిద్దరామయ్య మంత్రివర్గంలోకి 24 మంది..? రేపే ప్రమాణ స్వీకారం..
కాగా.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బహిష్కరించిన పార్టీలో సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా కేజ్రీవాల్ కు చెందిన ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీతో పాటు టీఎంసీ, కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో సహా మొత్తంగా 19 పార్టీలు ఉన్నాయి. అయితే ఏపీలోని వైసీపీ, టీడీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించింది. ఒడిశాలోని నవీన్ పట్నాయ్ కు చెందిన బీజేడీ కూడా ఈ కార్యక్రమంలో తమ పార్టీ పాల్గొంటుందని ఇప్పటికే ప్రకటించింది.