కర్ణాటక కేబినెట్ విస్తరణ.. సిద్దరామయ్య మంత్రివర్గంలోకి 24 మంది..? రేపే ప్రమాణ స్వీకారం..

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. 24 మంది పేర్లను ఇప్పటికే ఖరారు చేసింది. వీరంతా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 135 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లో అనేక మంది నాయకులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 

Karnataka cabinet expansion.. 24 people in Siddaramaiah's cabinet..? Swearing in tomorrow..ISR

కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన సిద్ధరామయ్య ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది. దాని కోసం ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. మొదటిసారిగా 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరంతా శనివారం (27వ తేదీ) ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. 

తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి.. అమిత్ షాకు స్టాలిన్ లేఖ

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ ఇద్దరు నేతలు కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సూర్జేవాలా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన నివాసంలో సమావేశం జరిగింది.

మళ్లీ ఒక సారి ఆలోచించండి..పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనండి: ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి

అనంతరం సిద్దరామయ్య, శివకుమార్ సహా కాంగ్రెస్ నేతలు పార్టీ గురుద్వారా రకాబ్ గంజ్ రోడ్ కార్యాలయంలో చర్చలు జరిపారు. రాష్ట్ర విస్తరణ మంత్రివర్గంలో చేర్చగల పేర్లపై చర్చించారు. శివకుమార్ బుధవారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకోగా, సిద్ధరామయ్య రాత్రికి వచ్చారు. ఈ నెల 20వ తేదీన కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగింది. అయినా ఇప్పటి వరకు మంత్రులకు శాఖలు కేటాయించలేదు. 

2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రజలను ఆహ్వానించిన యోగి ఆదిత్యనాథ్

కాగా.. నిబంధనల ప్రకారం కర్ణాటకలో గరిష్టంగా 34 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశావహులందరినీ సంతృప్తి పరచడం కాంగ్రెస్ కు కష్టతరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 66 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావించిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 19 స్థానాలకే పరిమితమైంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios