Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ జంటపేలుళ్ల కేసు: దోషులకు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో దోషులకు నాంపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది

Hyderabad blasts verdict today
Author
Hyderabad, First Published Sep 10, 2018, 9:41 AM IST

గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో దోషులకు నాంపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. 11 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం అక్బర్ ఇస్మాయిల్ చాదరి, అనీఖ్ షఫీఖ్ సయ్యద్‌లను దోషులుగా.. ముగ్గురిని నిర్దోషులుగా నిర్థారించిన న్యాయమూర్తి.. శిక్ష విధింపును సెప్టెంబర్ 10కి వాయిదా వేశారు. దీంతో ఈ రోజు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాలతో పాటు జంటనగరాల్లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో  తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.  ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా  ఎన్ఐఏ నిర్దారించింది. 

ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ  1125 పేజీల చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే  ఐదుగురిని పోలీసులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ పాల్పడింది.  ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్  మాత్రం ఇంకా  పోలీసులకు చిక్కలేదు. మరో వైపు  ఈ ఘటనకు పాల్పడిన పదకొండు మందిలో మరో నలుగురు ఎవరనే విషయాన్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు.

 

ఈ వార్తలు చదవండి

గోకుల్ చాట్ పేలుళ్ల కేసు: ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: 11 ఏళ్ల తర్వాత తుది తీర్పు
గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: సెప్టెంబర్ 4న తుది తీర్పు

గోకుల్‌చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు: వాదనలు పూర్తి, ఆగష్టు 27న తీర్పు

Follow Us:
Download App:
  • android
  • ios