హైదరాబాద్: గోకుల్‌చాట్, లుంబిని పార్క్  పేలుళ్లపై  విచారణ పూర్తైంది. ఈ నెల 27వ తేదీన  కోర్టు తీర్పును వెలువరించనుంది. 12 ఏళ్ల తర్వాత  ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో  తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.  ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా  ఎన్ఐఏ నిర్దారించింది. 

ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన  రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్  పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. 

ఈ ఘటనపై  వాదనలు పూర్తయ్యాయి.ఈ వాదనలకు సంబంధించి ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఈ నెల 27వ తేదీన వెలువర్చే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై ఎన్ఐఏ  అభియోగాలు నమోదు చేసింది.  ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును ఆగష్టు 27వ తేదీన కోర్టు వెలువర్చనుంది.

ఈ వార్త చదవండి:9/11 దాడుల లీడర్ అట్టా కుమార్తెతో బిన్ లాడెన్ కొడుకు హంజా పెళ్లి