Asianet News TeluguAsianet News Telugu

గోకుల్ చాట్ పేలుళ్ల కేసు: ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు


గోకుల్ చాట్ ,లుంబిని పేలుళ్ల కేసులో ఇద్దరికి  శిక్ష ఖరారు చేస్తూ కోర్టు నిర్ధారించింది. ఆధారాలు లేవని ఇద్దరిపై కేసును కోర్టు కొట్టివేసింది

gokul chat blast: nia court life sentence to two persons
Author
Hyderabad, First Published Sep 4, 2018, 11:20 AM IST

హైదరాబాద్:గోకుల్ చాట్ ,లుంబిని పేలుళ్ల కేసులో ఇద్దరికి  శిక్ష ఖరారు చేస్తూ కోర్టు నిర్ధారించింది.అక్బర్ ఇస్మాయిల్, అనీఖ్ షఫిక్ అహ్మద్ లను దోషులుగా  నిర్ధారించింది. వీరిద్దరూ కూడ కుట్రకు పాల్పడ్డారు.

నిందితులకు  ఎటువంటి శిక్ష ఖరారు చేస్తోందో సోమవారం నాడు తేలనుంది. ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కేసులను కోర్టు కొట్టివేసింది.నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి  చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఈ తీర్పును  మంగళవారం నాడు   వెలువరించారు. నాంపల్లి  అదనపు మెట్రో సెషన్స్ జడ్జి  ఈ తీర్పును వెల్లడించారు. 

గోకుల్‌చాట్, లుంబిని పార్క్  పేలుళ్లపై  విచారణ పూర్తైంది. గోకుల్ చాట్, లుంబిని పార్క్ కేసులకు సంబంధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు  మంగళవారం నాడు తీర్పు ఇచ్చింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు చర్లపల్లి జైలులోని ప్రత్యేక కోర్టులో తీర్పు ఇచ్చారు. 

2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో  తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.  ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా  ఎన్ఐఏ నిర్దారించింది. 

ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన  రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్  పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. 

ఈ ఘటనపై  వాదనలు పూర్తయ్యాయి.ఈ వాదనలకు సంబంధించి ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును  సెప్టెంబర్ 4వ తేదీన వెలువరించింది.ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్  పెద్ద  ఇంకా పోలీసులకు చిక్కలేదు

2007 ఆగష్టు 25వ తేదీన హైద్రాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద  పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.  ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ  1125 పేజీల చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే  ఐదుగురిని పోలీసులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ పాల్పడింది.  ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్  మాత్రం ఇంకా  పోలీసులకు చిక్కలేదు. మరో వైపు  ఈ ఘటనకు పాల్పడిన పదకొండు మందిలో మరో నలుగురు ఎవరనే విషయాన్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు.

ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు. 

ఈ వార్తలు చదవండి

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: 11 ఏళ్ల తర్వాత తుది తీర్పు

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: సెప్టెంబర్ 4న తుది తీర్పు

Follow Us:
Download App:
  • android
  • ios