గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: 11 ఏళ్ల తర్వాత తుది తీర్పు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 4, Sep 2018, 8:26 AM IST
Hyderabad twin bomb blasts case: verdict on today
Highlights


హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల ఘటనలో నాంపల్లి కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించనుంది. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లలో 44 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల ఘటనలో నాంపల్లి కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించనుంది. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లలో 44 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు కోసం నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది.

ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ తేల్చింది.. అనీక్ షఫీక్, ఇస్మాయిల్ చౌదరి, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీఖ్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రజాఖాన్‌లను నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీటు తయారు చేసింది. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో ఉంచారు.

పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఈ నెల 27నే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ, న్యాయమూర్తి చివరి నిమిషంలో తీర్పును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాంపల్లి కోర్టు, పాతబస్తీ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: సెప్టెంబర్ 4న తుది తీర్పు

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ నిందితులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

loader