Asianet News TeluguAsianet News Telugu

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: సెప్టెంబర్ 4న తుది తీర్పు

గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ళ కేసులో తుది తీర్పును సెప్టెంబర్ 4 వ  తేదీన ఇవ్వనున్నట్టు  ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం నాడు  ప్రకటించింది.

Verdict In 2007 Hyderabad Twin Bomb Blasts Today
Author
Hyderabad, First Published Aug 27, 2018, 11:32 AM IST

హైదరాబాద్: గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ళ కేసులో తుది తీర్పును సెప్టెంబర్ 4 వ  తేదీన ఇవ్వనున్నట్టు  ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం నాడు  ప్రకటించింది.

సోమవారం నాడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీనివాసరావు  వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్న  ఐదుగురు నిందితులను విచారించారు. 
సెప్టెంబర్ 4 వ తేదీన  వెల్లడించనున్నట్టు  ఈ తీర్పును వెలువరించనున్నారు. 
 

గోకుల్ చాట్.. లుంబిని పార్క్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం  సోమవారం నాడు తీర్పును వెలువర్చాలని భావించారు. అయితే నిందితులకు సంబంధించి వీడియోకాన్పరెన్స్ నిర్వహించిన తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీనివాసరావు ఈ తీర్పును సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్  పెద్ద  ఇంకా పోలీసులకు చిక్కలేదు. 2007 ఆగష్టు 25వ తేదీన హైద్రాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద  పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 42 మంది మృత్యువాత పడ్డారు.వందలాది మందికి పైగా గాయపడ్డారు.  ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే  ఐదుగురిని పోలీసులు 
చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు నిందితులు  పరారీలో ఉన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న శిక్షను అనుభవిస్తున్న  నిందితులను  ఎన్ఐఏ ప్రత్యేక జడ్డి  వీడియో కాన్పరెన్స్ ద్వారా సోమవారం నాడు  విచారించారు. 

ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ పాల్పడింది.  ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్  మాత్రం ఇంకా  పోలీసులకు చిక్కలేదు. మరో వైపు  ఈ ఘటనకు పాల్పడిన పదకొండు మందిలో మరో నలుగురు ఎవరనే విషయాన్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు.

ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు. 

ఈ వార్త చదవండి

గోకుల్‌చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు: వాదనలు పూర్తి, ఆగష్టు 27న తీర్పు


 

Follow Us:
Download App:
  • android
  • ios