Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించారని, 16యేళ్ల బాలుడు ఆత్మహత్య....

చదువుకునే వయసులో ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణ గూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. 

Hyderabad : 16-year-old dies after parents deny his love
Author
Hyderabad, First Published Oct 27, 2021, 9:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : తెలిసీ తెలియని వయసులో ప్రేమ మాయలో పడి మోసపోతున్న అమ్మాయిలు ఎంతోమంది. స్కూలు వయసునుంచే ప్రేమ, పెళ్లి అంటూ తిరుగుతూ.. చిన్న చిన్న విషయాలకే మనస్తాపాలకు గురవుతున్న అబ్బాయిలూ ఉంటున్నారు. క్షణికావేశంతో కాకుండా కాసేపు ఆగి, ఆలోచించి.. ఎందుకు చెబుతున్నారు అని విశ్లేషించుకునే జ్ఞానం కొరవడడంతో దారుణాలు జరిగిపోతున్నాయి. నిండు జీవితాలు బలవుతున్నాయి. అలాంటి ఓ విషాదమే నారాయణగూడలో చోటు చేసుకుంది. 

చదువుకునే వయసులో ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణ గూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్ కోఠిలో పర్దాగేట్ లో నివాసం ఉంటే బాలుడు (16) ఇంటర్ చదువుతున్నాడు. 

ఇటీవల ఎవరితోనో love affair సాగిస్తున్నాడని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అది నిజమే అని తెలిసింది. వెంటనే ఇంత చిన్న ageలో అది మంచిది కాదని పలుమార్లు మందలించారు. 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు సోమవారం అర్థరాత్రి గదిలోకి వెళ్లి తలుపు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన parents కిటికీలోంచి చూసేసరికి.. దారుణం కళ్లబడింది. 

చున్నీతో fanకి ఉరివేసుకుని hang అవుతూ విగతజీవిగా కనిపించాడు. వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని... యువతి ఇంటికి నిప్పంటించి....

అక్కడ ప్రేమ.. ఇక్కడ పెళ్లి...
ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ...యువతిని వివాహం చేసుకుంటానని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఒప్పుకోకపోవడంతో ఇంటిని తగలబెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలోని బీజేఆర్ నగర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఇన్ స్పెక్టర్ భిక్షపతిరావు, ఎస్ ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేఆర్ నగర్ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన నవీన్ (23) ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని రెండేళ్లుగా marriage పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. 

యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో threatsకు పాల్పడ్డాడు. ఈ నెల 10 న యువతి నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆమెకు పెళ్లి నిశ్చయించారు. 

విషయం తెలుసుకున్న నవీన్ ఈ నెల 22న తెల్లవారుజామున యువతి బంధువుకు ఫోన్ చేసి యువతి ఇంటిని తగలబెడతానంటూ హెచ్చరించాడు. అనంతరం 23న కాలనీ వాసులు యువతి ఇల్లు మంటల్లో కాలిపోయినట్లు గుర్తించి ఊళ్లో ఉన్నవారికి సమాచారం అందించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు నవీన్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios