Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని... యువతి ఇంటికి నిప్పంటించి....

బీజేఆర్ నగర్ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన నవీన్ (23) ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని రెండేళ్లుగా marriage పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. 

man burns down lover house due to not accepting marriage in medchal
Author
Hyderabad, First Published Oct 27, 2021, 9:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జవహర్ నగర్ : యువతిని వివాహం చేసుకుంటానని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఒప్పుకోకపోవడంతో ఇంటిని తగలబెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలోని బీజేఆర్ నగర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఇన్ స్పెక్టర్ భిక్షపతిరావు, ఎస్ ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేఆర్ నగర్ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన నవీన్ (23) ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని రెండేళ్లుగా marriage పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. 

యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో threatsకు పాల్పడ్డాడు. ఈ నెల 10 న యువతి నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆమెకు పెళ్లి నిశ్చయించారు. 

విషయం తెలుసుకున్న నవీన్ ఈ నెల 22న తెల్లవారుజామున యువతి బంధువుకు ఫోన్ చేసి యువతి ఇంటిని తగలబెడతానంటూ హెచ్చరించాడు. అనంతరం 23న కాలనీ వాసులు యువతి ఇల్లు మంటల్లో కాలిపోయినట్లు గుర్తించి ఊళ్లో ఉన్నవారికి సమాచారం అందించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు నవీన్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ లో మరో దారుణం...
కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అమానుషం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో వావివరసలు మరిచిన తండ్రి సభ్యసమాజం తలదించుకునేలా కూతురితో వ్యవహరించాడు. మద్యం మత్తులో అచ్చోసిన అంబోతులా వ్యవహరిస్తూ అభం శుభం తెలియని పదకొండేళ్ల కూతురిపై అఘాయిత్యానికి యత్నించగా తల్లి కాపాడింది.

కుక్కను నిలబెట్టినా గెలిపిస్తారు.. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే ఈటల గెలవాలి: బీజేపీ నేత తరుణ్ చుగ్

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. Hyderabad లోని దూల్ పేట గండి హనుమాన్ నగర్ కాలనీలో నర్సింగ్(30) అనే కార్మికుడు కుటుంబంతో కలిసి నివాసమముంటున్నాడు. అతడు రోజూ పని ముగించుకుని మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఇలాగే గత ఆదివారం కూడా ఫూటుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. 

నర్సింగ్ ఇంటికి చేరుకునే సరికి భార్యతో పాటు పదకొండేళ్ళ కూతురు నిద్రిస్తూ వుంది. అయితే మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నర్సింగ్ కన్న కూతురితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి వికృత చేష్టలతో బాలికకు మెలకువ వచ్చినా వదిలిపెట్టకుండా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గట్టిగా అరవడంతో తల్లి నిద్రలేచింది. దీంతో ఈ కామాంధుడు ఇంట్లోంచి పరారయ్యాడు. 

తనతో తండ్రి ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో బాలిక తల్లికి తెలిపింది. దీంతో ఆ తల్లి కట్టుకున్నవాడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నీచుడు నర్సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

తమ కుటుంబం పరువు పోతుంది... భర్త జైలుకెలతాడు అని భయపడకుండా తన కూతురిని వేధించిన కట్టుకున్నవాడిని జైలుకు పంపిన ఆ తల్లిని తెగువ ప్రశంసనీయం. తన కూతురి జోలికి వస్తే ఎవడినైనా చివరకు కట్టుకున్నవాడిని కూడా వదిలిపెట్టనని ఆ తల్లి నిరూపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios