Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కు కలిసిరాని నవంబర్ నెల.. ఆ ఎన్నికను గుర్తుచేసుకుంటున్న జనాలు..

హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypoll) ఫలితం వెలువడుతున్న తరుణంలో.. టీఆర్ఎస్ పార్టీకి నవంబర్ నెల కలిసి రాలేదని చర్చ జనాల్లో విపరీతంగా సాగుతుంది. ఇందుకు కారణంగా హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) ఆధిక్యంలో కొనసాగడం, గతంలో నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందని పలువురు గుర్తుచేస్తున్నారు. 

Huzurabad Bypoll November Month Unlucky For TRS Party Here Is Why
Author
Hyderabad, First Published Nov 2, 2021, 3:10 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypoll) ఫలితం వెలువడుతున్న తరుణంలో.. టీఆర్ఎస్ పార్టీకి నవంబర్ నెల కలిసి రాలేదని చర్చ జనాల్లో విపరీతంగా సాగుతుంది. ఇందుకు కారణంగా హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) ఆధిక్యంలో కొనసాగడం, గతంలో నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందని పలువురు గుర్తుచేస్తున్నారు. గతేడాది‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతపై రఘునందన్‌ రావు విజయం సాధించారు. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. ఈ పోరులో వెయ్యికి పైగా ఓట్ల అధిక్యంతో రఘునందన్‌రావు విజయాన్ని సొంతం చేసుకన్నారు. అయితే ఆ ఫలితాలు నవంబర్ 10వ తేదీన వెలువడ్డాయి. 

Also read: శత్రువుకు శత్రువు మిత్రుడు.. మాకు తప్పలేదు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..

అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్‌ 30న జరిగినప్పటికీ.. ఫలితాలు మాత్రం నేడు(నవంబర్ 2) వెలువడతున్నాయి. ఇందులో ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగడంతో నవంబర్‌ నెలలో వెలువడే ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకి కలసిరావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈటల విజయంపై బీజేపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.

ఇక, Huzurabad Bypoll ఫలితానికి సంబంధించి ఇప్పటివరకు 11 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. అందులో 9 రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరచగా.. 2 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాద్ అధిక్యం సాధించారు. ఇప్పటివరకు ఈటల 5,306 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 11 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.

Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది తేలిపోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios