టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దళిత బంధు పథకం పెద్దగా ప్రభావం చూపలేదని.. రివర్స్‌గా గట్టి షాకిచ్చినట్టుగానే తెలుస్తోంది.

huzurabad election results dalith bandhu May Not Attract Voters BJP leads in Shalapally

హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దళిత బంధు పథకం పెద్దగా ప్రభావం చూపలేదని.. రివర్స్‌గా గట్టి షాకిచ్చినట్టుగానే తెలుస్తోంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దళిత బంధు అమలులో భాగంగా.. సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లోని శాలపల్లిలో సభ నిర్వహించారు. అయితే అక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అధిక్యంలో ఉండగా.. శాలపల్లిలో కూడా బీజేపీకే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. శాలపల్లి ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో జరిగిందని అక్కడ కేసీఆర్ పాచిక పారలేదని.. ఈటల రాజేందర్‌కు ఆ రౌండ్‌లో అధిక్యం లభించిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

ఇక, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల విషయానికి వస్తే మూడొ రౌండ్‌లో కూడా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల ఆధిక్యం 1411 ఓట్లకు చేరింది. మూడో రౌండ్ లో బిజెపి 1053 ఓట్ల భారీ ఆధిక్యం సాధించింది. మరోవైపు రోటీ మేకర్ గుర్తుకు పడిన ఓట్లు టీఆర్‌ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది.

Also read: హుజురాబాద్ లో కూడా దుబ్బాక రిపీట్..? మరోసారి రోటి మేకర్ గుర్తు తెరాస కొంపముంచనుందా..?

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది తేలిపోనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios