హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) సంచలన కామెంట్స్‌ చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్ (Etela Rajender) మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) సంచలన కామెంట్స్‌ చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్ (Etela Rajender) మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు. ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించిన కోమటిరెడ్డి.. ఈ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీ భారీగా డబ్బులు ఖర్చు చేసిందని ఆరోపించారు. కేవలం 5 నెలల్లోనే 5 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. భారీగా డబ్బు పంచినా.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చే తీర్పు ఇస్తున్నారని అన్నారు. ఈటల రాజేందర్ 30 వేల మెజారిటీతో విజయం సాధించబోతున్నాడని అన్నారు. 

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ షాకివ్వబోతున్నట్టుగా చెప్పారు. శుత్రువుకు శ్రతువు మిత్రుడనే కోణంలో తాము ఈటలకు మద్దతిచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని.. అలా జరిగితే టీఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు. ఈటలకు పరోక్షంగా మద్దతిచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలతో తాము ఏకీభించడం లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్‌లో గెలుపు బీజేపీది కాదని.. ఈటల రాజేందర్‌ది అని అన్నారు. 

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం తొమ్మిది రౌండ్లలో ఫలితాలు వెలువడగా.. కేవలం ఒక్క ఎనిమిదో రౌండ్‌లో మాత్రం టీఆర్‌ఎస్ అధిక్యం కనబరిచింది. మిగిలిన ఎనిమిది రౌండ్లలో ఈటల అధిక్యం కనబరిచారు. మొత్తం 5 వేలకు పైగా అధిక్యంలో ఈటల కొనసాగుతున్నారు. 

Also read: హుజురాబాద్‌‌లో టీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు.. సీనియర్ నేతల ఇలాకాలో చేదు అనుభవం..

ఇక, ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.

Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది తేలిపోనుంది.