Asianet News TeluguAsianet News Telugu

హోంగార్డ్ రవీందర్ మృతి.. ఉస్మానియాకు మృతదేహం...

జీతాలు ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డ్ రవీందర్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. 

Home Guard Ravinder passed away, hyderabad - bsb
Author
First Published Sep 8, 2023, 9:19 AM IST

హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం ఆలస్యం అవుతుందని మనస్థాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన  హోంగార్డు రవీందర్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.  నాలుగు రోజుల క్రితం హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ రోజు నుంచి రవీందర్ కంచన్ భాగ్ లోని డిఆర్ డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని షాయినాయత్ గంజ్ ప్రాంతంలో ఉండే రవీందర్ అనే హోంగార్డు జీతాలు ఇవ్వడం ఆలస్యం అవుతుండడంతో.. ఈఎంఐలు ఖర్చలించలేకపోతున్నామని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. 

హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుంది: ఆత్మహత్యాయత్నం చేసుకున్న రవీందర్ కు కిషన్ రెడ్డి పరామర్శ

ఉప్పుగూడకు చెందిన 38 ఏళ్ల రవీందర్  హోంగార్డుగా చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం బ్యాంకులో అప్పు చేశాడు. దానికి ఈఎంఐ నెలనెలా 5వ తేదీన చెల్లించాల్సి ఉంటుంది.  

ఈనెల ఇంకా జీతం పడకపోవడంతో ఆయన గోషామహల్ లో ఉన్న హోంగార్డ్ కమాండెంట్ ఆఫీస్ కి వెళ్లి  ఆరా తీశారు.  ఇప్పటికే బ్యాంకులకు పంపించేశామని,  ఒకటి రెండు రోజుల్లో జీతం పడుతుందని వారు బదులిచ్చారు. ఈ ఘటన మంగళవారంనాడు జరిగింది. ఈఎంఐ అనుకున్న తేదీకి కట్టకపోతే  బౌన్స్ అవుతుందన్న బాధతో, మనస్థాపం చెంది అక్కడ అధికారులు ఎదుటే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  

సిబ్బంది  అతడిని  ఆసుపత్రికి అతడిని ఉస్మానియా ఆసుపత్రికి ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స చేసిన వైద్యులు రవీంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో.. డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన రవీందర్ ఈరోజు మృతి చెందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios