హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుంది: ఆత్మహత్యాయత్నం చేసుకున్న రవీందర్ కు కిషన్ రెడ్డి పరామర్శ
ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.
హైదరాబాద్: హోంగార్డులపై విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
గురువారంనాడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హోంగార్డులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు.హోంగార్డులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చారన్నారు.జీతాలు లేక హోంగార్డు కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.ప్రతికూల పరిస్థితుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.పోలీస్ వ్యవస్థలో సైతం హోంగార్డులకు అవమానం జరుగుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు.హోంగార్డు రవీందర్ ఆత్మాహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపీడీ జరుగుతుందన్నారు.
హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డులు 16 గంటలు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.ప్రత్యే బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపీడీ జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
హోంగార్డుల తరపున తాము పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హోంగార్డులు ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆయన కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డులకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రవీందర్ కు మంచి ట్రీట్ మెంట్ జరిగే విధంగా చూస్తామన్నారు.