Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తం: అభివాదం చేసి వెళ్లిపోయిన రేవంత్

 కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండో రోజు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం, రేవంత్ రెడ్డి బయటకు రాకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

high tension at revanthreddy house
Author
Hyderabad, First Published Sep 28, 2018, 7:46 PM IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండో రోజు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం, రేవంత్ రెడ్డి బయటకు రాకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుని రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని తమకు చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరోవైపు రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆందోళన కారులను అదుపు చేయడం కోసం రేవంత్ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరగడంతో మళ్లీ ఆందోళన కారులు రెచ్చిపోయారు.

రేవంత్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాము రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

అభిమానుల ఆందోళనల ఉద్రిక్తతలకు దారితియ్యడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని బయటకు తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి మధ్యలో బయటకు వచ్చి అభివాదం చేసి వెళ్లిపోయారు. 

మరోవైపు రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ పార్టీ నేత సీతక్క ఆరోపించారు. ఇన్ని గంటలపాటు ఎందుకు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ భూకబ్జాదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

 

Follow Us:
Download App:
  • android
  • ios