కోమటిరెడ్డి , సంపత్‌కుమార్‌లకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 21, Aug 2018, 12:31 PM IST
high court orders two months stay over komatireddy, sampath case
Highlights

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల  ఎమ్మెల్యేల పునరుద్దరణ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ ల ఎమ్మెల్యేల పునరుద్దరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు మాసాల పాటు  స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.
 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల  ఎమ్మెల్యేల పునరుద్దరణ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ ల ఎమ్మెల్యేల పునరుద్దరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు మాసాల పాటు  స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.


తమ సభ్యత్వాల పునరుద్దరణ విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు.ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును కోర్టు తప్పు బట్టింది. తక్షణమే వీరద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని  హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రకటించింది. ఈ తీర్పును  అమలు చేయలేదు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  సింగిల్ బెంచ్  తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చింది.

హైకోర్టు డివిజన్ చెంచ్  ఉత్తర్వులను కూడ అమలు చేయలేదు. దీంతో  కోర్టు ధిక్కరణ పిటిషన్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఈ విషయమై ఈ ఏడాది జూలై 27వ తేదీన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.  వారం రోజుల్లోపుగా ఈ విషయమై  స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎందుకు కొనసాగించడం లేదో చెప్పాలని కోరింది.


కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ  ఈ ఏడాది జూన్ 12వ తేదీన కేసులు దాఖలు చేశారు.ఈ కేసుపై ఆగష్టు 14వ, తేదీన హైకోర్టు సీరియస్ అయింది.కోర్టు ధిక్కరణ కేసుపై  హైకోర్టు సీరియస్ గా స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు  తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారికి కూడ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంపత్‌కుమార్ లను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు తీర్పును ఎవరూ అమలు చేయకపోయినా శిక్షార్హులేనంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది.ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన అసెంబ్లీ, లా సెక్రటరీలు కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

లా సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీలకు  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో వైపు స్పీకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరో వైపు  ఎమ్మెల్యేల జీత భత్యాల చెల్లింపు విషయమై  రిజిష్టర్‌ను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 28వ తేదీకి వాయిదా వేసింది.అంతేకాకుండా గన్‌మెన్లు కేటాయించకపోవడంపై  డీజీపీ, గద్వాల ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు కూడ హైకోర్టు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 

ఇదిలా ఉంటే  హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లారు.ఈ అప్పీల్‌పై మంగళవారం నాడు ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్ వాదించారు.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అసెంబ్లీ, లా సెక్రటరీలు తమ వాదనలను విన్పించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని వాదించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై రెండు మాసాల పాటు స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్వర్వులు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ఇచ్చినట్టేనని చెప్పుకోవచ్చు. మరో వైపు ఈ ఆదేశాలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, సంపత్‌కుమార్‌లకు షాక్ కల్గించాయి. ఈ ఉత్తర్వులపై ఆ ఇద్దరు ఏం చేస్తారోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

ఈ వార్తలు చదవండి

 

కోమటిరెడ్డి , సంపత్‌కుమార్‌లకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్

కోమటిరెడ్డి, సంపత్‌ కేసు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

సభ్యత్వాల రద్దు: కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కోమటిరెడ్డి, సంపత్

టిఆర్ఎస్‌కు మరో షాక్: 12 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

 

loader