టిఆర్ఎస్‌కు మరో షాక్: 12 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

High Court dismisses 12 TRS MLAs   petition on Congress MLAs Expulsion
Highlights

టిఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్
రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేయడంపై
సింగిల్ బెంచ్ ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్
ను ఆశ్రయించిన టిఆర్ఎస్‌కు నిరాశే ఎదురైంది.ఈ పిటిషన్
ను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది.దీంతో కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేలు, సంపత్‌కుమార్ లకు ఊరట లభించింది. 


కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై 12
మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచ్ ను
ఆశ్రయించారు.


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్
కుమార్‌లు ఈ ఏడాది మార్చి 12వ తేదిన అసెంబ్లీ బడ్జెట్
సమావేశాల ప్రారంభం సందర్భంగా హెడ్‌పోన్ విసిరిన
ఘటనలో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కన్నుకు
గాయాలయ్యాయి.

ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల
సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్
విడుదల చేసింది. ఈ గెజిట్ నోటీఫికేషన్ పై కాంగ్రెస్ పార్టీ
ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్
బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్ ను
రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 

అయితే సింగిల్ బెంచ్ తీర్పును నిరసిస్తూ 12 మంది
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచ్ ను
ఆశ్రయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నేత, సుప్రీంకోర్గు న్యాయవాది అభిషేక్ సింఘ్వి
తన వాదనలను విన్పించారు. 

ఇరువర్గాల వాదనలను వాదనలను విన్న తర్వాత
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్
బెంచ్ సోమవారం నాడు తీర్పును వెలువరించింది.

loader