Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు షాక్: స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయమై  హైకోర్టు  అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు  కోర్టు ధిక్కరణ  నోటీసులు జారీ చేసింది. స్పీకర్ మధుసూధనాచారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఈ కేసును ఆగష్టు 28వ తేదీకి వాయిదా వేసింది

Highcourt issues notices to assembly and law secretaries
Author
Hyderabad, First Published Aug 14, 2018, 3:30 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయమై  హైకోర్టు  అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు  కోర్టు ధిక్కరణ  నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఆగష్టు 28వ,తేదీకి వాయిదా వేసింది.

నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు  అసెంబ్లీ కార్యదర్శిపై  ఈ ఏడాది జూన్ 12వ, తేదీన  కోర్టు ధిక్కార  కేసును హైకోర్టులో దాఖలు చేశారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ కూడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ ను కొట్టేసింది. దరిమిలా ఆగష్టు 8వ తేదీన  తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  మార్చి 12న. ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల ప్రారంభసూచికంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు గవర్నర్ పై  హెడ్ ఫోన్ విసిరారు. దీంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ కన్నుకు గాయమైంది.

ఈ ఘటనను తెలంగాణ సర్కార్  సీరియస్ గా తీసుకొంది. నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.  అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్ లు  కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  

ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును కోర్టు తప్పు బట్టింది. తక్షణమే వీరద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని  హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రకటించింది. ఈ తీర్పును  అమలు చేయలేదు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  సింగిల్ బెంచ్  తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చింది.

హైకోర్టు డివిజన్ చెంచ్  ఉత్తర్వులను కూడ అమలు చేయలేదు. దీంతో  కోర్టు ధిక్కరణ పిటిషన్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఈ విషయమై ఈ ఏడాది జూలై 27వ తేదీన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.  వారం రోజుల్లోపుగా ఈ విషయమై  స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎందుకు కొనసాగించడం లేదో చెప్పాలని కోరింది.

కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు.ఈ కేసుపై ఆగష్టు 14వ, తేదీన హైకోర్టు సీరియస్ అయింది.కోర్టు ధిక్కరణ కేసుపై  హైకోర్టు సీరియస్ గా స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు  తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారికి కూడ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంపత్‌కుమార్ లను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు తీర్పును ఎవరూ అమలు చేయకపోయినా శిక్షార్హులేనంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది.ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన అసెంబ్లీ, లా సెక్రటరీలు కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

లా సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీలకు  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో వైపు స్పీకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరో వైపు  ఎమ్మెల్యేల జీత భత్యాల చెల్లింపు విషయమై  రిజిష్టర్‌ను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 28వ తేదీకి వాయిదా వేసింది.అంతేకాకుండా గన్‌మెన్లు కేటాయించకపోవడంపై  డీజీపీ, గద్వాల ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు కూడ హైకోర్టు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 

ఇదిలా ఉంటే  హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఆగష్టు 16 వతేదీన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించనుంది.ఈ కేసు విషయమై డివిజన్ బెంచ్ ఏ రకంగా స్పందిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈ వార్తలు చదవండి

కోమటిరెడ్డి, సంపత్‌ కేసు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

సభ్యత్వాల రద్దు: కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కోమటిరెడ్డి, సంపత్

టిఆర్ఎస్‌కు మరో షాక్: 12 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

 

Follow Us:
Download App:
  • android
  • ios