డీఎస్ తనయుడు  సంజయ్‌ హైకోర్టులో దాఖలు చేిసన క్వాష్ పిటిషన్ ను  కోర్టు కొట్టేసింది. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై సంజయ్‌పై నిర్భయ కేసు నమోదైంది.


హైదరాబాద్: డీఎస్ తనయుడు సంజయ్‌ హైకోర్టులో దాఖలు చేిసన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై సంజయ్‌పై నిర్భయ కేసు నమోదైంది.

శాంకరీ కాలేజీ నర్సింగ్ విద్యార్థులు తమను సంజయ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రికి , నిజామాబాద్ సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేశారు.

నర్సింగ్ విద్యార్థుల ఫిర్యాదుతో సంజయ్ పై నిజామాబాద్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని ప్రకటించిన సంజయ్ పోలీసు కేసు నమోదు కాకముందే నిజామాబాద్ నుండి హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

కేసు నమోదైన తర్వాత ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు సంజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

ఈ వార్తలు చదవండి:లైంగిక ఆరోపణలు:డీఎస్ తనయుడు సంజయ్‌పై నిర్భయ కేసు

సోదరుడు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: ట్విస్టిచ్చిన అరవింద్

సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు

డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు