Top Stories: నేడు రాష్ట్రంలో భీకర వర్షం, ఈవీఎంలు హ్యాక్, ‘ఇండియా’భేటీ వాయిదా

మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కుండపోతగా వర్షం పడింది. తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి.  రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
 

heavy rains expected in telangana yellow alert issued to 16 dists in telangana as michaung arriving, other top stories kms

మిచౌంగ్ తుఫాన్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పంజా విసిరింది. కుండపోత వర్షంతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ధాన్యం రాశులు తడిసిపోయాయి. మహబూబ్ నగర్‌లోనూ ధాన్యం నానిపోయింది. రాష్ట్రంలో బుధవారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. 16 జిల్లాలకు ఇది వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌లను పంపింది.

‘ఇండియా’ భేటీ వాయిదా

2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని నిలువరించి జెండా ఎగరేయాలని ప్రతిపక్ష పార్టీలు కొన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. పాట్నా సమావేశం నుంచి ఈ ప్రతిపక్ష కూటమి చర్చలు ప్రారంచారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబయి, ఇతర నగరాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే.. వీటన్నింటిని ఉన్నపళంగా వదిలి కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల బరిలోకి దిగడం, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎస్పీ, ఇతర విపక్ష పార్టీల పొత్తు ప్రతిపాదనలను ఖాతరు చేయకుండా పోటీ చేసి పరాజయం పాలైంది. ఇప్పుడు వెంటనే ఖర్గే మరో సమావేశానికి పిలవగా.. ముందుగా కేటాయించుకున్న షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నామని పలువురు సీఎంలు చెప్పారు. ఈ నెల 17న సమావేశం అవుదామని కొందరు నేతలు సూచించారు.

Also Read : Janasena Party: వైసీపీకి దొరికిపోయిన జనసేన.. బరిలో నిలబడకుండా టీడీపీ పర్ఫెక్ట్ డెసిషన్, ఎందుకంటే?

ఈవీఎంలు హ్యాక్:

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సీఎం విషయమై బీజేపీ తర్జనభర్తనలు పడుతున్నది. మరో వైపు కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్ సించలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికలలో ఈవీఎంలను హ్యాక్ చేశారని, వాటి ఆధారంగానే బీజేపీ గెలిచిందని అన్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే వారు సీట్ల సంఖ్య, ఓట్ల సంఖ్య తెలుపొందారు.

నేటి నుంచి ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్

భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రోజు నుంచి సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో పోరాబోతున్నది. ఈ మ్యచ్‌లు అన్నింటిని వాంఖడే స్టేడియంలో జరపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నది. ప్రపంచంలోనే నెంబర్ టూ జట్టు అయిన ఇంగ్లాండ్‌తో ఢీకొని నెట్టుకురావడం కష్టసాధ్యమే. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్.

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్

గిరిజన వర్సిటీ కోసం చకచకా నిర్ణయాలు

తెలంగాణలోని ములుగులో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తామని తెలంగాణలో పర్యటనలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios