CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. సీఎంగా స్టీరింగ్ తన చేతిలో పెడుతూనే బ్రేకులు మాత్రం అందరికీ అప్పజెబుతున్నట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ విలేకరుల సమావేశం ఈ విషయం వెల్లడి అయింది.
హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి సారథి. రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికి అధినాయకుడు. ఆయన అనుకుంటే సాధ్యమేం ఉంటుంది. తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుడు కేసీఆర్ నిర్ణయాలకు అడ్డు అనేది ఉండిందా? ఆయన నిర్ణయం తీసుకుంటే అమలై తీరింది. కానీ, ఇక పై అలా ఉండే అవకాశాలు లేవని తెలుస్తున్నది.
కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది వరకు మంత్రిపదవి కూడా చేయని రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు మంత్రిత్వ శాఖలను, డిప్యూటీ సీఎం బాధ్యతలూ నెరవేర్చిన సీనియర్లు ఇమడటం కష్టంగానే ఉన్నది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అందరినీ కలుపుకుపోతున్నారు. చాలా వరకు సీనియర్లను ఏకతాటి మీదికి తీసుకురాగలిగారు. కానీ, ఆయన సారథ్యంలో వీరు కొనసాగడం సాధ్యమా? ఒక వేళ బలవంతంగా ఉంచినా ప్రభుత్వం సుస్థిరంగా ఎన్నేళ్లు కొనసాగగలుగుతుంది? అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అయితే, ఈ అనుమానాలకు మంగళవారంనాటి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో దొరుకుతుంది.
Also Read : Telangana Cabinet: తెలంగాణకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు! సీతక్కకు ఏ శాఖ?
కేసీ వేణుగోపాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు చెప్పారు. అదే విధంగా ఏడో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారనీ వివరించారు. దీనితోపాటు ఓ విలేకరి సీనియర్ల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ కీలక విషయాన్ని వెల్లడించారు. తాము సీనియర్లు అందరినీ గుర్తించామని, వారి కృషిని గుర్తించామని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన వన్ మ్యాన్ షో ఉండదని స్పష్టం చేశారు. అంటే.. క్యాబినెట్‌లో సీఎం చెప్పినదే వినాలనే ధోరణి ఉండదని చెప్పారు. క్యాబినెట్ మొత్తం ఒక టీమ్‌గా ఉంటుందని తెలిపారు. అందరూ ఒక టీమ్‌గా ముందుకు వెళ్లుతారని వివరించారు.
Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డి జర్నలిస్టు అవతారం.. అసలు ఆ పత్రికలో ఎందుకు చేరాడు?
దీంతో సీఎం పదవిని రేవంత్ రెడ్డికి ఇచ్చినా.. పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారాలను ఆయనకు కట్టబెట్టలేదని విశ్లేషకులు చెబుతున్నారు.