నందమూరి హరికృష్ణకు తండ్రి ఎన్టీఆర్ అంటే ఎనలేని ప్రేమ.. ఆయన మాటను ఎన్నడూ జవదాటేవారు కాదు. రామకృష్ణ తర్వాత హరికృష్ణపైనే అన్నగారు ఎక్కువగా నమ్మకం ఉంచేవారు.


నందమూరి హరికృష్ణకు తండ్రి ఎన్టీఆర్ అంటే ఎనలేని ప్రేమ.. ఆయన మాటను ఎన్నడూ జవదాటేవారు కాదు. రామకృష్ణ తర్వాత హరికృష్ణపైనే అన్నగారు ఎక్కువగా నమ్మకం ఉంచేవారు. ఈ దశలో ఏళ్లుగా ఒకే పార్టీ పాలనలో నలిగిపోతున్న రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యమని భావించిన రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు గానూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టారు.

పాత చెవర్లేట్ వ్యాన్‌ను బాగు చేయించి దానికి ‘‘ చైతన్య రథం’’గా నామకరణం చేశారు. దీనిపై ఎన్టీఆర్ నిలబడి ప్రధాన కూడళ్లలో ఉపన్యాసాలు ఇచ్చేవారు. యాత్ర చేసిన అన్ని రోజులు ఈ చైతన్య రథాన్ని నడిపింది హరికృష్ణే. హరికృష్ణ సారథ్యంలో చైతన్య రథం మీదే మొత్తం నిర్విరామ షెడ్యూల్‌తో ఎన్టీఆర్ పార్టీ ప్రచారం సాగిస్తూ... పార్టీ పెట్టిన 9 నెలలకే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు.

ఒకసారి ఎన్టీఆర్ ఢిల్లీలో ప్రచారం అయిపోయి మర్నాడు ఉదయం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ప్రసంగించాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్నానని .. నీవు చైతన్య రథం తీసుకుని స్టేషన్‌కు రాగలవా అని ఎన్టీఆర్ హరికృష్ణకు కబురుపెట్టారు.

అయితే అప్పటికే హరికృష్ణ ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నారు. అయినప్పటికీ సుమారు 900 కిలోమీటర్లు నిద్రాహారాలు మాని ఉదయానికల్లా స్టేషన్‌కు వచ్చి అన్నగారిని ఎక్కించుకున్నారు. నడుములు పోతున్నా... కాళ్లకు బొబ్బలెక్కినా తన తండ్రి కోసం హరికృష్ణ అలాగే చేసేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. యాత్ర సమయంలో మొత్తం లక్ష కిలోమీటర్లు ఆయన డ్రైవింగ్ చేశారు. ఆ సమయంలో కుటుంబాన్ని సైతం హరికృష్ణ పక్కనబెట్టి తండ్రి కోసం కదనరంగంలోకి దూకారు.

ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?