Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ అంతిమ యాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కానుంది. మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టౌలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది.

harii krishna last journey..traffic diversions are here
Author
Hyderabad, First Published Aug 30, 2018, 12:14 PM IST

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు  ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.

హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కానుంది. మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టౌలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది. దీంతో ఎన్ఎండీసీ, షేక్‌పేట నాలా నుంచి విస్పర్ వ్యాలీ, మహాప్రస్థానం మార్గంలో వాహనదారులు వెళ్లొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సూచించింది. 

మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్ఎండీసీ-ముస్తాఫా జ్యూవెలర్స్-సరోజినిదేవి హాస్పిటల్-మెహదీపట్నం మీదుగా టౌలిచౌకీ ఫ్లైఓవర్, షేక్‌పేట, విస్పర్ వ్యాలీ జంక్షన్ వెళ్లొద్దని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. మసాబ్ ట్యాంక్ జంక్షన్ కుడి వైపు టర్న్ తీసుకొని గచ్చిబౌలి వైపు వెళ్లాలని సూచించింది. 

1/12 జంక్షన్, బంజారాహిల్స రోడ్ నంబర్ 1 మీదుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని నగర కమిషనర్ అంజని కుమార్ కోరారు. పాత బస్తీ నుంచి గచ్చిబౌలి వెళ్లే వారు.. పురానాపూల్ - వంద ఫీట్ల రోడ్, అత్తాపూర్ మీదుగా గచ్చిబౌలి వెళ్లాలని ఆయన సూచించారు. బహదూర్‌పుర, జూ పార్క్, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగానూ గచ్చిబౌలి వెళ్లొచ్చాని అంజనికుమార్ తెలిపారు. 

 

more news

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

Follow Us:
Download App:
  • android
  • ios